ఆ సినిమా బదులు రాధేశ్యామ్‌ సీక్వెల్‌ బెటర్‌…ప్రభాస్‌కు ఫ్యాన్స్‌ సలహాలు!

July 2, 2022

ఆ సినిమా బదులు రాధేశ్యామ్‌ సీక్వెల్‌ బెటర్‌…ప్రభాస్‌కు ఫ్యాన్స్‌ సలహాలు!

Fans Suggestions to Prabhas: హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ‘రాజా డీలక్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క, మాళవిక మోహనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరో మారుతి వంటి మీడియం రేంజ్‌ డైరెక్టర్‌తో వర్క్‌ చేయడం ఏంటీ? అని ..డార్లింగ్‌ (ప్రభాస్‌) ఫ్యాన్స్‌ మొదట్నుంచి గుర్రుగానే ఉన్నారు.అందుకే ఎప్పుడో ఆరంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ ఇంకా స్టార్ట్‌ కాలేదు. అయితే తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ఫ్లాఫ్‌ టాక్‌ తెచ్చుకుంది.

పైగా కథా బలం ఉన్న సినిమాగా కూడా పేరు తెచ్చుకోలేదు. దీంతో ప్రభాస్‌ కెరీర్‌లో మారుతి రూపంలో ఓ ఫ్లాఫ్‌ మూవీ పడుతుందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయ్యారు. కొందరయితే..మారుతితో సినిమా చేసే బదులు ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’కు సీక్వెల్‌ తీస్తే బాగుంటుందన్నట్లుగా సోషల్‌మీడియాలో పిచ్చి కామెంట్స్‌ పెడుతున్నారు(Fans Suggestions to Prabhas). మరి..ఇన్ని పరిణామాల మధ్య ప్రభాస్‌– మారుతి కాంబినేషన్‌లోని సినిమా ఉంటుందా? అంటే కాలమే చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం. మరోవైపు ప్రభాస్‌ కెరీర్‌లోని ‘రాధేశ్యామ్‌’ ఓ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే..

Read More: కుప్పంలో చంద్రబాబుకు పోటీగా విశాల్‌….నిజం ఇదిగో..!

ట్రెండింగ్ వార్తలు