మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్.. తెలుగులో కూడా వచ్చేస్తుంది!

March 27, 2024

మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్.. తెలుగులో కూడా వచ్చేస్తుంది!

మలయాళ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఇండస్ట్రీ హిట్ కొట్టిన సర్వైకల్ థ్రిల్లర్ సినిమా మంజుమ్మల్ బాయ్స్. ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. శోభున్ సాహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గేసే, అభిరామ్, అరుణ్ దీపక్ తదితరులు ప్రధానోపాత్రలలో నటించిన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే రికార్డులు క్రియేట్ చేసింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.

దర్శకుడు చిదంబరం ఎస్ పొడువల్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మలయాళ సినిమాల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. మొన్న మొన్ననే వచ్చిన ప్రేమలు సినిమా తెలుగు ఇండస్ట్రీ ని కూడా ఒక ఊపు ఊపింది.

ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చలనచిత్రంగా నిలిచిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓటీటీ వేదికగా వచ్చేందుకు సిద్ధమవుతుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకే దక్కించుకుంది. ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఇక సినిమా విషయానికి వస్తే యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు.

మంజుమ్మల్ బాయ్స్ అనేది ఒక కుర్రాళ్ల టీం. వీరంతా కమల్ హాసన్ అభిమానులు. తమిళనాడులోని గుణ గుహలకి విహారయాత్రలకు వెళ్తారు. గుణ సినిమా షూటింగ్ ఆ గుహలలోనే జరిగాయని తెలుసుకొని అక్కడికి వెళ్తారు. అయితే నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లొద్దు అని గైడ్ చెప్పినప్పటికీ అక్కడికి వెళ్లి ఒక వ్యక్తి ఒక డెవిల్స్ కిచెన్ లో పడిపోతాడు. దీంతో మిగిలిన యువకులు ఆ స్నేహితుడిని ఎలా కాపాడారు అనేది కథ. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుంది ఈ సినిమా.

Read More: ఈరోజు బెంగళూరులో రేపు ఇంకెక్కడైనా.. నీటి ఎద్దడి తగ్గించడానికి ఇలా చేయండంటున్న చిరంజీవి!

ట్రెండింగ్ వార్తలు