Nargis Fakhri: నా మాటలకు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది

November 20, 2023

Nargis Fakhri: నా మాటలకు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది

హాట్ అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళ గుండెల్లో చిచ్చుపెడుతుంది అమెరికన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri).

‘రాక్ స్టార్'(Rock Star)మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అమెరికన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri). 2011లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఆ త‌ర్వాత‌ మద్రాస్ కేఫ్(Madras Cafe), స్పై(SPY), హౌజ్‌ఫుల్ 3(HouseFul-3) సినిమాల్లో నటించి కుర్ర‌కారుని క‌ట్టిప‌డేసింది. ప్రస్తుతం ఈ భామ పవన్ కల్యాణ్ సరసన ‘హరి హర వీర మల్లు'(Hari Hara Veera Mallu) చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో తనపై ఎన్నో వదంతులు వచ్చాయని నర్గీస్‌ ఫక్రీ  తెలిపింది. ‘‘చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది నటులతో నన్ను లింక్ చేస్తూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. అవి నన్నెంతో బాధించాయి. షాహిద్ కపూర్‌(Shahid Kapoor) అపార్ట్‌మెంట్‌కు నేను షిఫ్ట్‌ అయ్యానని.. విషయం తెలిసి అతడిని కలవడానికి మా అమ్మ ఇక్కడికి వచ్చారని ఓసారి సోష‌ల్ మీడియాలో ఆర్టిక‌ల్స్‌ ప్రచురితమయ్యాయి. అవి చూసి చాలామంది నాకు సందేశాలు పంపారు. ‘మీ అమ్మ నగరానికి వచ్చారా?’ అని అడిగారు. ఆ స‌మ‌యంలో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది’’

‘‘బాలీవుడ్‌ నటులతో ఎంజాయ్‌ చేయడం ఎలా ఉంది?’ అని ఓ విలేకరి గతంలో నన్ను ప్రశ్నించింది. ఆ మాటలకు నాకు కోపం వచ్చింది. ‘నువ్వు నన్ను లెస్బియన్‌గా మారుస్తావని ఎదురుచూస్తున్నా’ అని బదులిచ్చా. నా మాటలకు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాకపోతే నా మాటలు అప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి’’ చెప్పుకొచ్చింది.

Read MoreTrisha Krishnan-Mansoor Ali Khan: మన్సూర్‌ అలీ వ్యాఖ్య‌ల‌పై NCW సీరియ‌స్‌

ట్రెండింగ్ వార్తలు