వెండితెరపై కాలచక్రం.. ప్రేక్షకులను కాలంతో పాటు వెనక్కి తీసుకెళ్తున్న హీరోలు?

March 25, 2024

వెండితెరపై కాలచక్రం.. ప్రేక్షకులను కాలంతో పాటు వెనక్కి తీసుకెళ్తున్న హీరోలు?

ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభివృద్ధి పూర్తిగా మారిపోయింది. కమర్షియల్ సినిమాలు ఆయనప్పటికీ ప్రేమకథా చిత్రాలలో కాకుండా చాలామంది సోసియో ఫాంటసీ నేపథ్యంలో రాబోయే సినిమాలను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నటువంటి తరుణంలో దర్శక నిర్మాతలు కూడా ఈ విధమైనటువంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఎన్నో టైం ట్రావెల్ కదా నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా ఇలా కాలంతో పాటు ప్రేక్షకులను కూడా వెనక్కి తీసుకువెళ్లి వారిని సర్ప్రైజ్ చేయబోతున్నారు మరి ఇలాంటి టైం ట్రావెల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే..

ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి తాజా చిత్రం కల్కి ఈ సినిమా సుమారు 6 వేల సంవత్సరాల వెనక్కి వెళ్లబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా టైం ట్రావెల్ కథ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రాబోతుందని ఇటీవల డైరెక్టర్ ఓ సందర్భంలో తెలియజేశారు ఇందులో దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలందరూ కూడా బాగమయ్యారు.

ఈ విధమైనటువంటి టైం ట్రావెల్స్ నేపథ్యంలో హీరో సూర్య నటించినటువంటి చిత్రం 24. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇలాంటి జానర్ లోనే ప్రస్తుతం సూర్య శివకుమార్ దర్శకత్వంలో కంగువా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.. ఈ సినిమాలు మాత్రమే కాకుండా మలయాల నటుడు టోవిసో థామస్, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వంటి వారందరూ కూడా ఈ విధమైనటువంటి టైం ట్రావెల్ కదా నేపథ్యంలో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు.

Read More: జూన్ లో రాబోతున్న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్?

ట్రెండింగ్ వార్తలు