January 28, 2022
యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్. నేడు న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్ విడుదలచేశారు.
‘రాక్షసున్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఇక శ్రీవిష్ణు సాఫ్ట్ రోల్‌లో కనిపించగా.. కేథరిన్ థ్రెస్సా మాత్రం పొగరుగా కనిపించారు. నీ దారిలో నువ్వు.. నా దారిలో నేను.. ఇద్దరి లక్ష్యం ఒకటే అనే డైలాగ్‌తో హీరో హీరోయిన్ల ప్రయాణం, లక్ష్యం ఏంటో చెప్పేశారు. యాక్షన్ సీక్వెన్స్, శ్రీ విష్ణు నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇక రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముగిసిన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. టీజర్‌లోని డైలాగ్స్ సినిమా కథ ఎలా ఉండోబోతోంది అనేది చెప్పేశాయి.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తుండగా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.