అర్జున ఫల్గుణ త‌ర్వాత‌ నేను మాస్‌ చిత్రాలకు పనికొస్తానో లేదో నిజాయితిగా చెప్పండి – శ్రీ విష్ణు

December 30, 2021

అర్జున ఫల్గుణ త‌ర్వాత‌ నేను మాస్‌ చిత్రాలకు పనికొస్తానో లేదో నిజాయితిగా చెప్పండి – శ్రీ విష్ణు

SriVishnu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఖాళీ చేతులతో వచ్చానని, ఇప్పుడు రూ.కోట్లకు మించిన ఆస్తిని సంపాదించానని నటుడు శ్రీవిష్ణు అన్నారు. ‘అర్జున ఫల్గుణ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. శ్రీవిష్ణు, అమృత అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించిన చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 31న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది ఈ సందర్భంగా..

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘55 రోజులు షూటింగ్ చేశాం. సినిమాను అందరం చాలా ఇష్టపడ్డాం. నాకు మైక్ పట్టుకుని మాట్లాడమే నచ్చదు. జగదీష్ నాకు ఏదో ఒక షాట్‌తో పిచ్చెక్కించాడు. పెద్ద కెమెరామెన్ అవుతాడు. సినిమా మొత్తం పెయింటింగ్‌లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ గురించి అందరూ బాగా చెప్పారు.. అతడు మరో బుడ్డి థ‌మ‌న్‌ కాబోతున్నాడు. సుధీర్ డైలాగ్‌లు చాలా రాశాడు.. గోదావరి జిల్లాల్లో మాటల మాదిరిగా అందరితో చెప్పించారు. తేజ మర్ని పైకి అలా కనిపిస్తున్నాడు గానీ.. పెద్ద ఫైర్ బ్రాండ్. షూటింగ్‌లో షేక్ ఆడించాడు. నేను నిజంగా భయపడ్డాను. మనం సెట్ అవుతామా అని అనుకున్నాను. చాలా ఫోర్స్ ఉన్న డైరెక్టర్. మహేష్, చైతన్య, చౌదరి, అమృత.. తేజ గురించి బాగా చెప్పారు. వాళ్లకు తేజ ఏ కథ చెప్పాడో తెలియదు గానీ.. సినిమా చూశాక నేను హీరోనా..? వీళ్లందరు హీరోలా..? అని అనిపించింది. ప్రతి ఒక్కరు ఇరగదీశారు. నాకు తెలిసి తేజ.. ప్రతి ఒక్క ఆర్టిస్టు దగ్గరకు వెళ్లి నువ్వే ఈ సినిమాకు హీరో అని చేయించి ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంది.. ఈ సినిమాలో చాలా మంచి పెర్ఫామెన్స్‌లు చూస్తారు. నేను సినిమాల్లోకి ఉట్టి చేతులతో ఆర్ట్‌ను నమ్ముకుని వచ్చాను. నాకు ఈ రోజు చాలా ఆస్తి ఉంది. కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తి ఉంది. నా ఆస్తి నేను పరిచయం చేసిన నా డైరెక్టర్లు అందరూ. ఈ ఆస్తి వాళ్లు చేసే చేసే సినిమాలకు ఒక రేంజ్‌లకు వెళ్తుంది. మాదాపూర్, కొండాపూర్ దాటేసి.. రియల్ ఎస్టేట్ భూమ్ ఉన్న శంషాబాద్‌ వైపు వెళ్తున్నాను. నాకు దొరికే డైరెక్టర్లను నేను అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లు ఏదో గొప్పగా చెప్పారు గానీ.. అంతా మేము కలిసి పనిచేసిందే. గోదావ‌రి గురించి నేను చాలా గొప్పగా చెప్పగలను. అర్జున ఫల్గుణ మొత్తం గోదావరి జిల్లాల్లోనే షూట్ చేశాం. ఒకటి రెండు పర్సెంట్ తప్ప. అందరూ కూడా కాలర్ ఎగరేసి ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకొంటారు. నేను ఎప్పుడు కథనే సినిమాగా చేశాను. నా ఫ్రెండ్స్ కామెడీ, ఫ్యామిలీ, బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు చేయమని చెప్పేవారు. మాస్ సినిమాలు వద్దనే వారు. డిసెంబర్ 31 తర్వాత మీరు చెప్పండి నేను మాస్ సినిమాలకు పనికి వస్తానో రానో మీరు నిజాయితీగా చెప్పండి. సినిమాలో మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బయట తేజ జూనియర్‌కు పెద్ద ఫ్యాన్. అందరికి కోస్తే రక్తం వస్తుంది.. కానీ తేజకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. ఆయన పేరు చెబితేనే తేజ ముఖం వెలిగిపోతుంది. సినిమా చూస్తే మేము కష్టపడి చేశామో లేదో మీకే తెలుస్తోంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. 10 నిమిషాలకే గోదావరి జిల్లాలకు వెళ్లిపోతారు. 15 నిమిషాలకే కథలోకి వెళ్లిపోతారు అక్కడి నుంచి గోదావరి జిల్లాలో కనిపించే మంచి మనుషుల మనసులు, అమాయకత్వాలు, సంప్రదాయాలు ఇవన్నీ కనిపిస్తాయి. చాలా అట్రాక్ట్ అవుతారు. ఈసారి సంక్రాంతి పండగ డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఉంటుంది. మల్కల్ లంక అనే ఊరు వాళ్లు చాలా సపోర్ట్ చేశారు. ఆ ఊరు ఈ సినిమాతో ఫేమస్ అవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేపించారు. ఐదుగురు అమాయకులు, మంచి మనుసులున్న వ్యక్తుల వైన్ షాపు ఫ్రెండ్ షిప్. ఐదుగురు అమాయకులు చిన్న ఇదిలో ఇరుక్కుని ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా. సినిమాలో చాలా చోట్ల పునకాలు వచ్చే ఎపిసోడ్లు ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమా ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను.“ అన్నారు.

Read More: నువ్వు ఒక సెకెండ్ హ్యాండ్ ఐటెం..నెటిజ‌న్ కామెంట్‌కు స‌మంత షాకింగ్ రిప్లై…

ట్రెండింగ్ వార్తలు