WHAT THE FISH: నిహారిక కొణిదెల ఫస్ట్ లుక్

December 18, 2023

WHAT THE FISH: నిహారిక కొణిదెల ఫస్ట్ లుక్

నిహారిక కొణిదెల(Niharika Konidela) ‘వాట్ ది ఫిష్‌(WHAT THE FISH)’ తో కమర్షియల్‌ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇందులో నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తోస్తున్నారు. వరుణ్ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్.

‘వాట్ ది ఫిష్(WHAT THE FISH)’ అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. 6ix సినిమాస్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిహారిక(Niharika Konidela) స్టైలిష్‌గా నడుస్తూ కనిపించారు. తన వెనుక డాలర్ ఇమేజ్‌ వుంది. నిహారిక ఎలిగెంట్అవతార్‌లో మెరిసే వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

ఆమె పాత్ర అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్. ఈ పాత్రని చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. తెలుగు సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్, యాక్షన్- డ్రివెన్ పాత్ర. ఆమె పాత్ర ప్రేక్షకులని అద్భుతంగా అలరించబోతుందని దర్శకుడు చెప్పారు.

Read More: డంకీ ప్రమోషన్స్ కోసం దుబాయ్‌లో షారూక్.. హద్దుల్లేని అభిమానుల ఆనందం

ట్రెండింగ్ వార్తలు