తల్లిదండ్రులుగా మారిన మనోజ్ మౌనిక.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మౌనిక?

April 13, 2024

తల్లిదండ్రులుగా మారిన మనోజ్ మౌనిక.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మౌనిక?

భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సినీ నటుడు మంచు మనోజ్ ను వివాహం చేసుకున్నటువంటి ఈమె నేడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ విషయాన్ని మంచు మనోజ్ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. భూమా మౌనిక మనోజ్ ఇదివరకే వేరే వ్యక్తులను వివాహం చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు అయితే విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తిరిగి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి బంధంతో ఒకటైనటువంటి వీరిద్దరూ నేడు తల్లిదండ్రులుగా మారారు పెళ్లయిన కొద్ది రోజులకే మనోజ్ మౌనిక తల్లి కాబోతుందని విషయాన్ని వెల్లడించారు. ఇలా ఎప్పటికప్పుడు తన భార్య ప్రెగ్నెన్సీ గురించి ఆమె ఆరోగ్యం గురించి మనోజ్ తెలియజేస్తూ వచ్చారు.

అయితే నేడు ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విషయం చెప్పడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తమకు అమ్మాయి జన్మించిందనే విషయాన్ని వెల్లడించారు. ఇక మంచు లక్ష్మి ఆ శివయ్య ఆశీస్సులతో కుమార్తె జన్మించిందని ఈ చిన్నారికి తాను ఎంఎం పులి అని నిక్ నేమ్ పెట్టుకుంటున్నట్లు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మౌనికకు ఇదివరకే ఓ కుమారుడు కూడా ఉన్నారు. బాబు పుట్టిన తర్వాత ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకొని వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ బాబు బాధ్యతలను కూడా మనోజ్ చూసుకోవటం విశేషం.

https://telugu.chitraseema.org/tillu-square-striking-with-jet-speed-the-box-office/

ట్రెండింగ్ వార్తలు