నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు: మనోజ్

March 22, 2024

నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు: మనోజ్

సినీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మోహన్ బాబు వారసుడిగా మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా హీరోగా పలు సినిమాలలో నటించినటువంటి ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే తిరిగి తన సినీ కెరియర్ పై ఫోకస్ చేసి అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇకపోతే ఇటీవల తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మనోజ్ ఆంధ్ర ఎన్నికల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకునేవారు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

ఎవరైతే మీతో పాటు మీకు తోడుగా నడుస్తారో అలాంటి వారిని ఎన్నుకోండి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఓటు వేయమని అడిగితే డబ్బు తీసుకోండి కానీ దారుణాలకు పాల్పడే వారికి ఓటు వేయద్దు సొంత కుటుంబానికి న్యాయం చేయలేనివారు మనకు చేయలేరు అందుకే సరైన నాయకుడిని ఎన్నుకోండి అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఇలా సొంత కుటుంబానికి న్యాయం చేయలేదంటూ మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే చేశారని వైఎస్ఆర్సిపి అభిమానులు భారీ స్థాయిలో ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా తన గురించి ట్రోల్స్ వస్తున్నటువంటి తరుణంలో మనోజ్ పై స్పందిస్తూ..

తాను చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని బహుశా సాంకేతిక లోపం వల్ల నేను మాట్లాడినటువంటి మాటలు మీకు తప్పుగా అర్థం కావచ్చని తెలిపారు. అందుకే నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ నేను ఏ పార్టీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. నా ప్రసంగంపై నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలనుకున్నా. ప్రతీది రాజకీయంగా చూడకుండా ఐక్యత, గౌరవంగా ముందుకు సాగాలనేది నా మాటల ఉద్దేశం. ఏదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. గొడవలు కూడా లేవు. నటుడిగా నన్ను, నా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఈయన అసలు విషయం తెలిపారు.

Read More: పెళ్లి జరిగితే పద్ధతిగా ఉండాలా.. మగవాళ్లను ఎందుకు ప్రశ్నించరు: రకుల్

ట్రెండింగ్ వార్తలు