April 15, 2024
తెలుగు సినీ ప్రేక్షకులకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచి మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో మనోజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే గత ఏడాది మంచు మనోజ్ భూమా మౌనికని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనోజ్, మౌనిక అన్యోన్యంగా జీవిస్తున్నారు. పెళ్లి తర్వాత తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు మనోజ్,మౌనిక జంట.
అయితే ఆ మధ్యన మౌనిక గర్భవతి అయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం రోజు భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో మంచు మనోజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా భూమా మౌనిక పాపతో కలసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. దీనితో మనోజ్ దగ్గరుండి భార్య బిడ్డని ఇంటికి తీసుకువచ్చాడు. తొలిసారి పాపతో మౌనిక, మనోజ్ ఇంటికి రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. దిష్టి తీసి ఇంట్లోకి తల్లి బిడ్డని ఆహ్వానించారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోలు చూసిన ప్రేక్షకులు, అభిమానులు పాప ఫేస్ ఎప్పుడు రివిల్ చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబంతో కావలసినంత సమయాన్ని గడుపుతూనే మరోవైపు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ప్రయత్నంలో ఉన్నారు మనోజ్.
Read More: నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటన పై అలాంటి వాఖ్యలు చేసిన అమర్ దీప్.. కామెంట్స్ వైరల్?