March 27, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటి వంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారడమే కాకుండా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సంపాదించేసుకున్నాడు. ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మొదటి భాగం అక్టోబర్ నెలలో దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ పలు సినిమాలలో కూడా పాటలు పాడిన సంగతి మనకు తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా ఎన్టీఆర్ పాటలు పాడారు. ఈయనకు పాటలు పాడటం అన్న మ్యూజిక్ అన్న కూడా అంత ఇష్టం.
ఇక తనకు ఇష్టమైనటువంటి పాటలు ఏదైనా ఉన్నాయి అంటే అది కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని ఆశ పాశం అనే సాంగ్ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు నచ్చని పాటల గురించి ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కీరవాణి ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ నేను కంపోజ్ చేసినటువంటి పాటలలో నీకు ఏది అంటే నచ్చదని ప్రశ్న వేశారు. ఈ పాటకు తారక్ సమాధానం చెబుతూ నాగార్జున హీరోగా నటించిన ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడ పాలు కావాలా అనే పాట నాకు అసలు నచ్చదని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: భార్యకు దగ్గరవటానికి సలహా అడుగుతున్న విజయ్ ఆంటోనీ.. ఆసక్తికరంగా లవ్ గురు ట్రైలర్!