ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. టాప్ వన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

April 22, 2024

ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. టాప్ వన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఖాతాల్లో రెండు మూడు హిట్ సినిమాలు పడ్డాయి అంటే చాలు వెంటనే ఆయా హీరో హీరోయిన్ల క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే టాప్ హీరో, హీరోయిన్ల జాబితాలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఎవరు గొప్ప ఎవరు టాప్ వన్ అంటే మా హీరో గొప్ప మా హీరోయిన్ గొప్ప అని ఎవరికి వారు అభిమానులు చెబుతూ ఉంటారు. అందుకే టాప్ లో ఎవరున్నారు అనే దానిపై సర్వేలు చేసి మరీ ఫలితాలను వెల్లడిస్తుంటారు.

ముఖ్యంగా అందరూ మెచ్చే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్… నిజమైన ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా 2024 మార్చి నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ హీరోయిన్లు ఎవరన్న దానిపై సర్వే చేసి మరీ ఫలితాలు తెలిపింది. అయితే దేశం మెచ్చిన బ్యూటీల్లో బాలీవుడ్ భామల కంటే ఎక్కువగా తెలుగు హీరోయిన్లే ఉండడం గమనార్హం. 5 గురు బాలీవుడ్ భామలు టాప్ 10లో ఉండగా మరో ఆరుగురు టాలీవుడ్ బ్యూటీలో టాప్ లో నిలిచి ట్రెండ్ సెట్ చేశారు. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన టాప్ 10 హీరోయిన్ల లిస్టులో మొదటి స్థానంలో సమంత నిలిచింది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ లో నిలుస్తుంది.

అలాగే ఇక టాప్ 2లో బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ నిలిచింది. టాప్ 3లో దీపికా పదుకొణె నిలిచింది. ఇటీవల జవాన్ సినిమాలో అథితి పాత్రలో నటించిన ఈ భామ కుర్రకారు మదిలో స్థానం సంపాధించుకుంది. అలాగే టాప్ 4లో కాజోల్ అగర్వాల్ నిలిచింది. ఇక ఐదవ స్థానంలో కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. ఇక టాప్ 6లో రష్మిక మందన్నా నిలిచింది. ఇటీవలే యానిమల్ తో ట్రెండ్ సెట్ చేసిన ఈమె ట్రెండింగ్ లోకి వచ్చింది. టాప్ 7లో నయనతార నిలిచింది. ఇక టాప్ 8లో త్రిష నిలిచింది. ఈ మధ్య చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్న ఈమె టాప్ లోకి వచ్చేసింది. ఇక టాప్ 9లో కీర్తి సురేష్ నిలిచింది. ఇక టాప్ 10లో కృతి సనన్ నిలవగ గతేడాది ఆది పురుష్ సినిమాతో పాటు గణ్ పథ్ చిత్రంలో నటించింది.

Read More: హీరో ప్రభాస్ ఆ వ్యక్తి కారణంగానే కోప్పడతారా.. కోపం తెప్పించే వ్యక్తి అతనేనా?

ట్రెండింగ్ వార్తలు