వామ్మో సమంత ఏంటి ఇలా బాడీ పెంచేస్తుంది.. బన్నీ సినిమా కోసమేనా?

April 8, 2024

వామ్మో సమంత ఏంటి ఇలా బాడీ పెంచేస్తుంది.. బన్నీ సినిమా కోసమేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని చెప్పాలి. ఈమె మయో సైటీసెస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి తరుణంలో ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నటువంటి సమంత తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి సమంత అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నారంటూ కూడా ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ ఇంకా ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటనలు మాత్రం వెలబడలేదు. ఇక సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఈమె తిరిగి ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టారు.

ఈ క్రమంలోనే తరచూ జిమ్ లో వర్కౌట్ చేస్తూ భారీ స్థాయిలో కష్టపడుతూ తనని తాను మలుచుకుంటూ ఉన్నారు. ఇలా వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో షేర్ చేసింది. సమంత జిమ్ లో వెనక్కి తిరిగి తన బ్యాక్ బాడీ, చేతులు చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సమంత ఏంటి ఇంతలా బాడీ పెంచేస్తోంది. ఏ సినిమా కోసం ఈమె ఇంత వర్కౌట్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు బహుశా అల్లు అర్జున్ సినిమా కోసమే ఇలా కష్టపడుతున్నారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఇలా వర్కౌట్ చేస్తున్నడం చూస్తుంటే ఈమె గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Read More: నేను నాలాగే ఉంటాను.. ముద్దు సీన్లలో నటిస్తే తప్పేంటి: అనుపమ

ట్రెండింగ్ వార్తలు