April 22, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ ఎప్పుడు చూసిన చాలా సరదాగా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరిపై కోప్పడిన సందర్భాలను మనం చూడలేదు.
కానీ ప్రభాస్ కి మాత్రం కోపం తెప్పించే వ్యక్తి ఒకరు ఉన్నారని ఆయన తరచూ ప్రభాస్ కి కోపం తెప్పిస్తూ ఉంటారంటూ తాజాగా రాజమౌళి గతంలో చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా రాజమౌళి ప్రభాస్ కి కోపం తెప్పించే వ్యక్తి గురించి అసలు విషయం తెలియజేశారు. రాజమౌళి సినిమా అంటే హీరోలకు టార్చర్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే .
మీ వల్ల ప్రభాస్ ఎప్పుడైనా కోప్పడ్డారా అని యాంకర్ ప్రశ్నించగా నావల్ల కాదు కానీ ప్రభాస్ కి కోపం తెప్పించే వ్యక్తి ఒకరు ఉన్నారు అంటూ రాజమౌళి అసలు విషయం తెలిపారు. .కెమెరామెన్ సెంథిల్ తరచు ప్రభాస్ కి కోపం తెప్పిస్తూ ఉంటారని ఆయన పై ప్రభాస్ కోప్పడుతూ ఉంటారని తెలిపారు. సెంథిల్ నాకన్నా చాలా పర్ఫెక్ట్ ఆయన ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు.
అది ప్రభాస్‌కు కోపం తెప్పిస్తుంది. కోపం వచ్చినప్పుడు ప్రభాస్.. ఏయ్ సెంథిల్.. ఏంత సేపయ్యా.. ఎన్నాళయ్యా.. అంటాడు అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్‌తోపాటు మ్యానరిజం కూడా అచ్చుదింపాడు రాజమౌళి. ప్రభాస్‌ని సేమ్‌గా దింపేసిన రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More: దేవర మూవీ ఐటమ్ సాంగ్ లో చిందులు వేయబోతున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?