హనుమాన్ సినిమాని ఓటీటీ లో కన్నా ముందే టీవీలో చూడొచ్చు.. ఎప్పుడు, ఎక్కడంటే?

March 9, 2024

హనుమాన్ సినిమాని ఓటీటీ లో కన్నా ముందే టీవీలో చూడొచ్చు.. ఎప్పుడు, ఎక్కడంటే?

సంక్రాంతి కానుక గా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం 40 కోట్లతో తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్లకు పైగా వసూళ్లని సాధించి ట్రేడ్ నిపుణుల ని సైతం ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.

అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇప్పటివరకు మూవీ మేకర్స్ దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ జీ 5 కూడా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పటం గమనార్హం. అయితే ఈ సినిమా ఓటీటీ లో కన్నా ముందుగా టీవీలలో ప్రసారం అవ్వటానికి సిద్ధపడింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే కేవలం హిందీ వర్షన్ లో మాత్రమే టీవీలలో ప్రసారం అవుతుంది. మార్చి 16వ తేదీ రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీలో తొలిసారి కలర్స్ సినీ ఫ్లెక్స్, జియో సినిమాల్లో చూడండి అని సదరు చానల్స్ ట్రీట్ చేశాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మన విశ్వంలో తొలి సూపర్ హీరో ఇప్పుడు టీవీ స్క్రీన్ లపై కనిపించబోతున్నాడు అని ట్వీట్ చేశాడు. హీరో తేజ సజ్జా కూడా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరో తేజ సజ్జ నటన అందరినీ ఎంత ఆకట్టుకుందో అతని సోదరి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన కూడా అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. వినయ్ రాయ్ విలనిజం, వెన్నెల కిషోర్, జబర్దస్త్ శ్రీను కామెడీ ఈ సినిమాకి మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. Read More : ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో సినిమాకి కుబేర టైటిల్ ఫిక్స్.. ధనుష్ బికారి లా కనిపిస్తున్నాడే?

ట్రెండింగ్ వార్తలు