కొబ్బరితోటలో సిగ్గుమొగ్గలేస్తున్న పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్!

January 10, 2024

కొబ్బరితోటలో సిగ్గుమొగ్గలేస్తున్న పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. పూజ హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు. అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడం. ఇకపోతే పూజా హెగ్డే చివరగా ఈ ఏడాదిలో విడుదలైన కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఈ సినిమా కంటే ముందు విడుదలైన బీస్ట్, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజా హెగ్డే కెరియర్ కాస్త డల్ అయ్యింది. అయితే ఈమె త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తుండగా ఊహించని విధంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీ లీలా వచ్చింది. ప్రస్తుతం సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది పూజ హెగ్డే.

సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది పూజా హెగ్డే. ఈ మధ్యకాలంలో వరుసగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా పూజా హెగ్డే తన ఇంటి దగ్గర ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలో పద్ధతిగా వైట్ కలర్ లెహంగాను ధరించిన ఈ ముద్దుగుమ్మ కొబ్బరి తోటలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వాటిని చూసిన అభిమానులు క్యూట్ గా ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో పద్ధతిగా కనిపిస్తూనే పైట కొంగును గారిలో విసిరేస్తూ తన నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది పూజా హెగ్డే..

Read More: ఛీ ఛీ మీరు మారరు ఇక.. రీతూ, విష్ణుప్రియ వీడియోలపై ట్రోలింగ్!

ట్రెండింగ్ వార్తలు