July 2, 2022
ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్‌కు స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే ఈ సంస్థకు అనుబంధ సంస్ధగా జీఏ2ను స్థాపించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ బ్యానర్‌లో మీడియం రేంజ్ సినిమాలనే నిర్మిస్తుంటారు. ఈ సినిమాల నిర్మాణ బాధ్యతలను బన్నీ వాసు చూసుకుంటుంటారు. అయితే రీసెంట్ టైమ్స్‌లో ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించడం లేదు. బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలను మూట గట్టుకుంటున్నాయి. ‘చావు కబురు చల్లగా..’, ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ రిజల్ట్స్‌యే ఇందుకు ఓ ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా మాత్రం ఫర్వాలేదనిపించింది. అలాగే మలయాళ హిట్ నాయట్టు తెలుగు రీమేక్‌ను రావురమేష్, ప్రియదర్శి, అంజలిలతో స్టార్ట్ చేశారు. కానీ ఈ సినిమా ఆగిపోయిదంటున్నారు. ఇలా సినిమాలు ఆగిపోవడం, అటు వైపు నిర్మించిన సినిమాలు సరిగా థియేటర్స్‌లో ఆడకపోవడం, ఇటీవల తెరపైకి వచ్చిన బోయ సునీత వివాదం ఇలా….అన్నీ బన్నీ వాసును టెన్షన్‌లోకి నెట్టాయి. మరి.. ఈ సమస్యలను ఆయన ఎలా దాటుకుని వస్తారో చూడాలి మరి.