ఆద్య గురించి ఆ విషయం చెప్పిన రేణు దేశాయ్… ఫోటో వైరల్!

March 15, 2024

ఆద్య గురించి ఆ విషయం చెప్పిన రేణు దేశాయ్… ఫోటో వైరల్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు.ఈయన సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ రాబోతున్నటువంటి తరుణంలో తన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన రెండో వివాహంగా నటి రేణు దేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరు పిల్లల బాధ్యతలను రేణు దేశాయ్ చూసుకుంటున్నారు. ఇక అకీరా ప్రస్తుతం విదేశాలలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు అయితే ఇన్ని రోజులు పూణేలో ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం హైదరాబాద్ మకాం మార్చారు.

ఇకపోతే రేణు దేశాయ్ తన పిల్లల బాధ్యతలను చూసుకోవడమే కాకుండా వారికి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె తన కుమార్తె ఆద్య గురించి ఓ విషయాన్ని వెల్లడించారు. ఆద్యకు ముక్కుపుడక కుట్టించాలని ఎప్పటినుంచో ఈమె అనుకుంటుందట గత ఏడాది నుంచి ముక్కుపుడక కుట్టించుకోవడాన్ని ఆద్య వాయిదా వేస్తూ వస్తున్నారని అయితే చివరికి తనకు ముక్కుపుడక కుట్టించానని తెలిపారు.

ఇలా ఆధ్య ముక్కు కుట్టించినటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఆడపిల్లలు ముక్కు, చెవులు కుట్టించుకోవడాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అమ్మాయిలకు ఆభరణాలు అలంకారం కాబట్టి పెద్దవాళ్ళు ముక్కు, చెవులు కుట్టిస్తారంటూ తన కుమార్తెకు ముక్కు కుట్టిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ ఫోటోల పై పలువురు స్పందిస్తూ ఈమె చాలా పెద్దది అయిందని ఇక తనకు నగలు కొనాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కి పెరిగింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

renu desai shares a good news about daughter aadhya

Read More: Shriya Saran: నాగార్జున నాకు గొప్ప సాయం చేశారు!

ట్రెండింగ్ వార్తలు