సైంధవ్ ట్రైలర్… యాక్షన్ మోడ్ లో వెంకీ మామ.

January 3, 2024

సైంధవ్ ట్రైలర్… యాక్షన్ మోడ్ లో వెంకీ మామ.

దగ్గుబాటి వెంకటేష్ హీరోగా ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ఈయన నటించిన సైంధవ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

హిట్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ ఎలా ఉంది ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనే విషయానికి వస్తే… ఈ ట్రైలర్.. 3 నిమిషాల 36 నిమిషాల నిడివి కలిగి ఉంది. ట్రైలర్ ప్రారంభంలో తన కూతురితో ఆడుకొంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న హీరోని చూపించారు.

కూతురితో ఎంతో సరదాగా గడుపుతూ ఉన్నటువంటి వీరి జీవితంలో అనుకొని విషాదం జరుగుతుంది. తన కూతురు అరుదైన నరాల బలహీనత సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి బ్రతకాలి అంటే ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది ఆ ఇంజక్షన్ 17 కోట్లు కావడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని కంగారుపడుతూ ఉంటారు. అసలు నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడిని సైందవ్ అంటూ వెంకటేష్ ని ప్రశ్నించడంతో అప్పుడు ఈ ట్రైలర్లు యాక్షన్ మోడ్ స్టార్ట్ అవుతుంది.

ఎక్కువగా ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించినటువంటి సీన్స్ చూపించారు. అలాగే ఈ ట్రైలర్ లో హీరో ఆర్య కూడా కనిపించారు. ఇక ఈ ట్రైలర్ లో హీరోయిన్ కంటే ఎక్కువగా ఆన్డ్రియా స్క్రీన్ స్పేస్ ఆక్యు పై చేశారని తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఈ ట్రైలర్ లో వెంకటేష్ చెప్పినటువంటి కొన్ని డైలాగ్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ కనుక చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ మూవీ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Read More: హనుమాన్ వెనక్కి తగ్గనుందా? దిల్ రాజు మైండ్ గేమ్ స్టార్ట్.

ట్రెండింగ్ వార్తలు