ఘనంగా వెంకటేష్ కుమార్తె హయవాహిని వివాహం.. ఫోటోలు వైరల్!

March 16, 2024

ఘనంగా వెంకటేష్ కుమార్తె హయవాహిని వివాహం.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు లేదా సెలబ్రిటీల పిల్లలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇలా గత కొద్ది నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలో పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా మరికొందరు నిశ్చితార్థాలను జరుపుకొని పెళ్లికి సిద్ధమవుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వెంకటేష్ రెండవ కుమార్తె హయవాహిని వివాహ వేడుకలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. వెంకటేష్ నీరజ దంపతులకు నలుగురు సంతానం కాగా ఇందులో ముగ్గురు అమ్మాయిలు అర్జున్ అనే కుమారుడు ఉన్నారు. ఇప్పటికే తన పెద్ద కుమార్తె ఆశ్రితకు ఎంతో ఘనంగా వివాహం జరిగిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా రెండో కుమార్తె హయవాహిని వివాహపు వేడుకలు ఘనంగా జరిగాయి.

హయవాహిని విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమారుడు నిశాంత్ అనే వ్యక్తితో కలిసి ఏడడుగులు నడిచారు. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థపు వేడుకలు విజయవాడలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ నిశ్చితార్థపు వేడుకలకు మహేష్ బాబు,చిరంజీవి, రానా, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు.. అయితే మార్చి 15వ తేదీ ఈమె వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో వీరి వివాహం జరిగింది. అయితే వీరి వివాహ కార్యక్రమానికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం హయవాహిని నిశాంత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది వెంకీ అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read More: సమంత ఒంటరిగా ఉన్న రాత్రి ఆ పని చేయనిదే నిద్రపోదా?

ట్రెండింగ్ వార్తలు