Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ కథలు మరో బ్లాక్ బస్టర్ మూవీ పడ్డట్టేనా?

January 13, 2024

Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ కథలు మరో బ్లాక్ బస్టర్ మూవీ పడ్డట్టేనా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్. ఈ సినిమాకు డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. కాగా ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ మూవీ జనవరి 13న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే అమెరికాలో సైంధవ్ ప్రీమియర్ షోలు మొదలు అయ్యాయి. దీంతో ఓవర్సీస్ నుంచి సైంధవ్ ఎలా ఉందో రిపోర్ట్ ఇస్తున్నారు ఎన్నారై ప్రేక్షకులు.

సైంధవ్ మూవీకి సంబంధించిన పోస్టులతో ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే.. కాగా సైంధవ్ మూవీ గురించి ట్విట్టర్ లో ఒక్కొక్క నెటిజన్ ఒక్కొక్క విధంగా ట్వీట్ చేశారు. సైంధవ్ మూవీ స్టైలిష్ యాక్షన్ డ్రామా అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే వెంకటేష్ యాక్షన్ అదుర్స్ అంటున్నారు. సైంధవ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందని, వెంకీ మామ మరోసారి అదరగొట్టాడని, ముఖ్యంగా సెకండాఫ్‌లో ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ అంటున్నారు నెటిజెన్స్. అలాగే ఎమోషనల్ సీన్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారని రాసుకొచ్చారు. వెంకటేష్ వన్ మ్యాన్ షో. శైలేష్ కొలను ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ అంటే ఇలా ఉండాలి అని ఒక నెటిజన్ టిట్వర్‌లో పేర్కొన్నారు.

ఈ మూవీ లో ఫస్ట్ ఆఫ్ లో వెంకీ మామ ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నాడట. ఇంటర్వెల్ బాగుందట. ఫస్టాఫ్ కూడా బాగానే ఉందట. సెకండాఫ్‌లో కూడా స్టోరీ బాగుందట. క్లైమాక్స్ అదుర్స్ అని రాసుకొచ్చారు. మరో నెటిజన్ ఈ మూవీకి 5కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సినిమా స్టార్టింగ్ లో మొదటి 30 నిమిషాలు స్లోగా సాగినప్పటికీ పోను పోను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందట. అదేవిధంగా యాక్షన్ సీక్వెన్స్, పర్ఫామెన్సెస్ బాగున్నాయి. బీజీఎమ్ ఇంకాస్తా బెటర్‌గా ఉండాల్సింది. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది అంటూ సైంధవ్ మూవీ ఫస్టాఫ్‌పై రివ్యూ ఇచ్చారు. అలాగే హీరో వెంకటేష్ కెరీర్‌లోనే బెస్ట్ క్లైమాక్స్ ఇది. వెంకీ ఆన్ డ్యూటి. మొత్తంగా అన్ని రకాల ఎమోషన్స్‌తో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది అంటున్నారు.

https://twitter.com/harshakaruturi/status/1745888120803893392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745888120803893392%7Ctwgr%5Ec1ac47b54af7f95322df8badb7b40bf35031d33f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fhindustantimestelugu-epaper-dhd89021265933408bbb908fe162fa51b0%2Fsaindhavtwitterreviewsaindhavtvitarrivyuvenkimaamayaakshanadurskaaniadokkatemainas-newsid-n573793190

Read More: రిపబ్లిక్ డేకి రాబోతున్న కెప్టెన్ మిల్లర్!

ట్రెండింగ్ వార్తలు