పేరు మార్చుకున్న సల్మాన్‌ఖాన్‌!

September 5, 2022

పేరు మార్చుకున్న సల్మాన్‌ఖాన్‌!

హిందీలో సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సల్మాన్‌ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? అని సల్మాన్‌ఖాన్‌ ఫ్యాన్స్‌ అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సెప్టెంబరు 5న సల్మాన్‌ఖాన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. తన కొత్త సినిమా టైటిల్‌ను అధికారికంగా విడుదల చేశాడు. ఈ సినిమాకు ‘కీసీ కీ భాయ్‌..కీసీ కీ జాన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్, వెంకటేశ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. అయితే స‌ల్మాన్ ఖాన్ కు గ‌ర్ల్ ఫ్రెండ్‌గా వెంక‌టేష్ కు చెల్లెలిగా పూజా హెగ్దె న‌టిస్తుండ‌డం విశేషం. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు తొలుత ‘కబీ ఈద్‌ కబీ దీవాలి’ అనే టైటిల్‌ అనుకున్నారు. ఆ తర్వాత ‘భాయిజాన్‌’ అనే టైటిల్‌ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌గా ‘కీసీ కీ భాయ్‌..కీసీ కీ జాన్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.సల్మాన్‌ఖాన్‌ నటించిన మరో చిత్రం టైగర్‌ 3. వచ్చే ఏడాది ఈద్‌కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక సల్మాన్‌ఖాన్‌ తెలుగులో ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘గాడ్‌ఫాదర్‌’ అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకుడు. ఇందులో చిరంజీవి హీరోగా, నయనతార కీలక పాత్రలో నటించారు.ఈ చిత్రాలే కాకుండా సల్మాన్‌ఖాన్‌ ‘పఠాన్‌’లో, మరాఠి చిత్రం ‘వేద్‌’లో గెస్ట్‌ రోల్స్‌ చేశారు. షారుక్‌ఖాన్‌ హీరోగా చేసిన ‘పఠాన్‌’ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానుంది.

ట్రెండింగ్ వార్తలు