Katrina Kaif: టైగర్ 3లో జోయా పాత్ర నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.

October 30, 2023

Katrina Kaif: టైగర్ 3లో జోయా పాత్ర నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్(Salman Khan) కి టైగ‌ర్ ఫ్రాంచైజీ బాగా క‌లిసి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆ ఫ్రాంచైజీలో భాగంగా స‌ల్మాన్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన హై ఆక్టేన్ యాక్ష‌న్ మూవీ టైగ‌ర్-3(Tiger-3). ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్(YashRaj Films) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై జోయా పాత్రలో కత్రినా కైఫ్(Katrina Kaif) న‌టిస్తోంది. ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా..

కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘తన దేశాన్ని లేదా కుటుంబాన్ని, మానవత్వాన్ని కాపాడే సందర్భాల్లో ఓ మహిళ ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుందని టైగర్ 3లో చూపించాం. నా కెరీర్‌లో నేను చేసిన పాత్రల్లో జోయా పాత్ర చాలా పవర్‌ఫుల్. జోయా పాత్ర ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగిపోతుంది..యుద్ధం చేయాల్సిన సందర్భంలో ఆమె ఎప్ప‌టికీ వెనుకడుగు వేయదు. జోయా స్టైల్ ఆఫ్ యాక్షన్ యూనిక్‌గా ఉంటుంది. ట్రైలర్‌లో చూపించిన విధంగా క్లిష్టమైన యాక్షన్ సీన్స్‌లోనూ జోయా ఎలాంటి ఇబ్బంది లేకుండా నటిస్తుంది. ఆమె ఒంటరిగా వందలాది శత్రువులతో పోరాడటాన్ని మనం వెండితెరపై చూడొచ్చు.

యష్ రాజ్ ఫిలిమ్స్ నా పాత్రను ప్రతీ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. ఇలాంటి స్పై చిత్రంలో యాక్షన్ సీక్వెన్సుల్లో నటించటంతో నా కల నేరవేరినట్లుగా ఉంది. ఈ ఫ్రాంచైజీలో నేను వందకు రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నించాను. టైగర్ ఫ్రాంచైజీలో జోయా పాత్ర నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి రెండు నెలల పాటు శిక్షణను తీసుకున్నాను. అందుకు కారణం జోయా పాత్ర మరింత వేగంగా, బలంగా కనిపించాలనేదే. దాని కోసం చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లోనే ఇది కఠినమైన ట్రైనింగ్. నేను చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు మరెవ్వరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్‌తో కలిసి పని చేశాను. ఈ యాక్షన్ సన్నివేశాలను వెండి తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనే చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

Read More‘టైగర్ 3’ లో ట‌వ‌ల్ ఫైట్ పై నటి హాట్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు