July 23, 2023
మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ..ఈ సినిమాకు సంబంధించి ఆన్‌సెట్స్, ఆఫ్‌సెట్స్‌లో వ్యవహారం అంతా ఘాటు ఘాటు గానే సాగుతోంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా, అదీ కూడా పన్నెండేళ్ల తర్వాత అనగానే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా షూటింగ్‌కు అడుగడుగున ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. మహేశ్‌బాబు సహోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా, ఆ తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ చనిపోయారు. మహేశ్‌కు జరిగిన ఈ భారీ పర్సనల్ లాస్ వలన ఈ సినిమా షూటింగ్‌కు పెద్ద పెద్ద బ్రేక్స్ పడ్డాయి.
అంతా సద్దుమణిగిన తర్వాత త్రివిక్రమ్, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. కానీ కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మహేశ్‌కు నచ్చలేదు. ఆ తర్వాత స్టోరీయే నచ్చలేదు. దీంతో స్క్రిప్ట్ మొత్తం మారిపోయింది. త్రివిక్రమ్ ఫ్రెష్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. మళ్లీ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. కానీ మహేశ్ వరుస వేకేషన్స్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు మళ్లీ మళ్లీ బ్రేక్స్ పడ్డాయి. ఈ బ్రేక్ టైమ్‌లో త్రివిక్రమ్ ‘బ్రో’, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోని మరికొన్ని సినిమాలపై ఫోకస్ పెట్టాడు. గుంటూరు కారం ఘాడీ తప్పింది. అలాగే ‘గుంటూరు కారం’లో ఓ హీరోయిన్‌గా నటిస్తున్న పూజాహెగ్డే తప్పుకున్నారు. దీంతో ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్‌గా చేసి, సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరిని తీసుకున్నారు.
రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. కానీ మళ్లీ ఇప్పుడు మహేశ్‌బాబు వేకేషన్‌కు వెళ్లారు. ఈ వేకేషన్ టైమ్ ఓ మూడు నాలుగు రోజులే ఉంటుందనుకున్న త్రివిక్రమ్‌కు మహేశ్ భారీ షాకే ఇచ్చాడు. ఏకంగా ఇరవై రోజులు వేకేషన్‌కు వెళ్లారట మహేశ్. దీంతో మహేశ్‌పై త్రివిక్రమ్ గరంగరంగా ఉన్నాడు. అలాగే ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్, పీఎస్ వినోద్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల ..వైకుంఠపురములో..’ సినిమాకు డీవోపీగా పని చేశారు వినోద్. ఇక ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌ను తప్పిస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది.
సెట్స్‌లో సరిగా లేదని పూజాహెగ్డే ఆరోపణ. మహేశ్ కారణంగా షూటింగ్ సాజావుగా సాగడం లేదని త్రివిక్రమ్ ఆరోపణ. కథ, స్క్రిప్ట్ బాగో లేదని, ఇంప్రూవ్ చేయాలని మహేశ్ ఆరోపణ. మ్యూజిక్ విషయంలో తమన్‌కు, త్రివిక్రమ్‌కు పడటం లేదని గాసిప్ రాయుళ్ల మాట…ఇలా ‘గుంటూరు కారం’ సెట్స్‌లో అంతా గరం గరమే. మరి.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా అనుకున్నట్లు సంక్రాంతికి రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ సీ
ఇంకా చదవండి: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఈవెంట్లో దీపికా పదుకొనె ఎందుకు పాల్గొనలేదో తెలుసా…?