సమంత కొత్త ఫోటోలు.. చూస్తే వావ్ అనాల్సిందే!

December 26, 2023

సమంత కొత్త ఫోటోలు.. చూస్తే వావ్ అనాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు పుష్కర కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి ఈమె మయోసైటిస్ బారిన పడ్డారు. తద్వార ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసమే కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత తిరిగి హీరోయిన్ గాను నిర్మాతగాను ఇండస్ట్రీకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈమె తన నిర్మాణ సంస్థను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. క్రీమ్ కలర్ డ్రెస్సులో చాలా క్యూట్ గా ఉన్నటువంటి ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలలో ఈమె కాస్త బుంగమూతి పెట్టుకుని ఫోజులిచ్చారు. ప్రస్తుతం సమంత(Samantha) ఈ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత కొత్త సంవత్సరం నుంచి తన కెరియర్ తిరిగి ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

Read More: తరతరాలుగా ఉన్న పని మనిషి.. నమ్రత పోస్ట్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు