సమంత భారీ వర్కౌట్లు.. ఇక ఇదే చివరిదట!

December 30, 2023

సమంత భారీ వర్కౌట్లు.. ఇక ఇదే చివరిదట!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి మనందరికీ తెలిసిందే. సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఈ సినిమాతో సూపర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఆమె దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుపుతూ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసం ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా సమంత సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అలాగే పలు రకాల యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. ఒకవైపు వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరొకవైపు బాగానే సంపాదిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత జిమ్ లో తరచూ వర్కౌట్ చేస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంది. ఇక అందులో బాగానే తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక ఫోటోని షేర్ చేసింది.

ఆ ఫోటోలో సమంత(Samantha) జిమ్ లో వర్క్ ఔట్స్ లో బాగంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది. 2023 లో ఇదే నా లాస్ట్ వర్కౌట్ కౌంట్ అంటూ రాసకొచ్చింది సమంత. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఒక్కొక్కరు ఒక విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మొన్నటికీ మొన్న సమంత తాను తిరిగి మళ్లీ సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుపుతూ ఒక ఫోటోని కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక సమంత కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఎవరి దర్శకత్వంలో ఏ సినిమాతో సమంత మళ్ళీ ఈ ప్రేక్షకులను పులకరిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Read More: మరీ ఇంత పొట్టి బట్టలా?.. రష్మిక ఫోటోపై ట్రోలింగ్

ట్రెండింగ్ వార్తలు