ఏడాది అంతా చేసిన పని అదే.. సమంత వీడియో వైరల్?

January 1, 2024

ఏడాది అంతా చేసిన పని అదే.. సమంత వీడియో వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటూ తన ఫిట్నెస్ విషయంపై జాగ్రత్తలు వహిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తన చికిత్స కు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూనే బిజీబిజీగా గడిపిన సమంత ఇప్పుడు పూర్తిగా తన ఫిట్నెస్ విషయంపై జాగ్రత్తలు వహిస్తోంది. ఇక ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోనే వీడియోని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది సమంత. ఇటీవల కాలంలో వరుసగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తాను విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తాను మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పోస్ట్ పెట్టి అభిమానులకు శుభవార్త తెలిపింది. తర్వాత రెండు 2023లో చేస్తున్న ఆఖరి వర్కౌట్ ఇదే అంటూ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోని షేర్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత మరొక వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ఆ వీడియోలో సమంత(Samantha) పడుకుని ఉండగా పైన నెలలో వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఏడాది మొత్తం పడుకునే ఉన్నాను అని సింబాలిక్ గా చెబుతూ ఆ వీడియోని షేర్ చేసింది సమంత. అంతేకాకుండా ఆ వీడియోని షేర్ చేస్తూ ఏడాది అంతా చేసిన పని అదే అంటూ క్యాప్షన్ ని కూడా జోడించింది. న్యూ ఇయర్ సందర్భంగా ఆ ఓల్డ్ వీడియోని షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో సమంతకు అభిమానులు పెద్ద ఎత్తున న్యూ ఇయర్ విషెస్ ను తెలుపుతున్నారు. కాగా సమంత మళ్ళీ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు రియంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read More: గోవాలో బిగ్ బాస్ సావిత్రి ఎంజాయ్!.. బీఆర్ఎస్ ఇచ్చిన డబ్బులు ఇంకా అయిపోలేదా?

ట్రెండింగ్ వార్తలు