మిమ్మల్ని నా సినిమాలో తీసుకొని తప్పు చేశాను.. నటుడు పై సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

April 19, 2024

మిమ్మల్ని నా సినిమాలో తీసుకొని తప్పు చేశాను.. నటుడు పై సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

సందీప్ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. హిందీలో కబీర్ సింగ్ పేరిట విడుదల అయింది. అక్కడ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా ఏకంగా తొమ్మిది వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించగా కొందరు ఈ సినిమా పట్ల తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేస్తూ డైరెక్టర్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఎదుర్కొన్న నెగిటివిటీ కంటే పాజిటివిటీనే అధికంగా ఉందని చెప్పాలి.

ఇకపోతే సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన కబీర్ సింగ్ సినిమాలో నటించినటువంటి ఒక నటుడు.అదిల్ హుస్సేన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన కబీర్ సింగ్ సినిమాలో నేను నటించి చాలా పశ్చాత్తాపడుతున్నానని తెలిపారు ఈ సినిమాలో కాలేజ్ ప్రిన్సిపల్ పాత్రలో నటించినటువంటి ఈయన ఆ పాత్ర నేను చేయకుండా ఉండాల్సిందే నేను చేసిన సీన్ మంచిదే కానీ సినిమా కథ తెలియకుండా నేను ఈ సినిమాలో నటించానని అందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నానని తెలుపుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈయన చేసినటువంటి వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి స్పందించారు. మీరు నమ్మిన 30 సినిమాల నుంచి రాని పేరు ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా నుంచి వచ్చినందుకు మీరు బాధపడుతున్నారా..? షేమ్ నేను నా సినిమా మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను పశ్చాత్తాప పడుతున్నానని తెలిపారు. అయినా మీరేం బాధపడకండి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మీ ఫేస్ మారుస్తాను అప్పుడు హ్యాపీగా నవ్వుకోండి అంటూ తన స్టైల్ లోనే కౌంటర్ ఇస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ అనుపమ సస్పెన్స్ థ్రిల్లర్ సైరన్.. ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు