April 19, 2024
కోలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా ప్రేక్షకుల మందికి వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నటువంటి చిత్రాలలో నటి కీర్తి సురేష్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో నటించినటువంటి లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం సైరన్.టాలెంటెడ్ నటుడు జయం రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళనాడులోకి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురుచూస్తున్నారు. కేవలం తమిళ భాషలో మాత్రమే థియేటర్లలో విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అభిమానుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నేటి నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నారు. నేటి నుంచి ఒరిజినల్ తమిళ్ సహా తెలుగు, కన్నడ, మళయాళం మరియు హిందీ భాషలతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాని చూడాలనుకునేవారు వెంటనే మనం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమా అని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాకు ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్, జివి ప్రకాష్ లు సంగీతం అందించారు.
Read More: రాజమౌళితో మహేష్ బాబు.. ఆకట్టుకుంటున్న మహేష్ బాబు న్యూ లుక్!