అమీర్ ఖాన్ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా?

February 3, 2024

అమీర్ ఖాన్ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా?

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన అనిమల్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇకపోతే దర్శకుడు సందీప్ రెడ్డి కు చాలామంది బలుపు ఉంది అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది ఆ బలుపు ఉంటేనే సినిమాలు తీయగలరు అంటూ ఆయనకు మద్దతుగా కామెంట్ చేసే వారు కూడా ఉన్నారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన అనిమల్ సినిమా ఓటీటీ లో విడుదల అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయనపై విమర్శలు ఆగడం లేదు. మరి ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రిటీలు అనిమల్ సినిమాపై దుమ్మెత్తిపోస్తున్నారు.

రాధికా, కస్తూరి, తాప్సీ ఇలా ఒక్కొకరుగా అనిమల్ సినిమా దారుణంగా ఉందని విమర్శలు గుప్పించారు. ఇక ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా చేరింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె అనిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. బాహుబలి, కబీర్ సింగ్, అనిమల్ స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఆ వాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన ఆ వ్యాఖ్యలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ తనదైన స్టైల్ లో ఆన్సర్ చెప్పుకొచ్చాడు. ఆమె అన్న వ్యాఖ్యలు నేను విన్నాను.

ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ ను వెళ్లి అడగమనండి.. ఆయన నటించిన దిల్ సినిమాలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా చేస్తాడు. అది కూడా ఆమె తప్పు చేసిందని నమ్మిస్తాడు. చివరికి ఆ అమ్మాయి.. హీరోనే ప్రేమిస్తుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు అంటూ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు సందీప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు సందీప్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు కిరణ్ రావుకి మద్దతుగా కామెంట్స్.

Read More: వేసవి విడుదలకు సిద్ధమైన ఫ్యామిలీ స్టార్.. రిలీజ్ డేట్ ఫిక్స్?

ట్రెండింగ్ వార్తలు