కార్తీక దీపం మోనిత.. అవార్డ్ రావడంతో శోభా శెట్టి ఫుల్ ఖుషీ

December 26, 2023

కార్తీక దీపం మోనిత.. అవార్డ్ రావడంతో శోభా శెట్టి ఫుల్ ఖుషీ

Shobha Shetty: తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సీరియల్లో కార్తీకదీపం సీరియల్ ఒకటి ఈ సీరియల్ లో నటించినటువంటి నటీనటులకు భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఏర్పడ్డారు. ఇక ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించినటువంటి పరిటాల నిరుపమ్ పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సీరియల్ లో దీప అలాగే మోనిత పాత్రకు కూడా మంచి ఆదరణ లభించింది.

ఈ సీరియల్ లో శోభా శెట్టి(Shobha Shetty) మోనిత పాత్రలో విలన్ గా నటించి సందడి చేశారు. అయితే ఈ పాత్రకు కూడా భారీ స్థాయిలోనే అభిమానులు ఉన్నారని చెప్పాలి ఇక ఈ సీరియల్ లో ఈమె నటించినటువంటి విలన్ పాత్రకు తాజాగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇలా కార్తీకదీపం విలన్ పాత్రకు గాను ఈమె రాష్ట్రీయ గౌరవ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదే విషయాన్ని మోనిత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కార్తీకదీపంలో బెస్ట్ విలన్ పాత్రలో నటించినందుకు తనకు రాష్ట్రీయ గౌరవ అవార్డు లభించిందని, ఇలా ఈ పాత్రకు అవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈమె తెలియజేశారు. ఇలా నన్ను ఆశీర్వదించి, సపోర్ట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ఈమె ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా బెస్ట్ విలన్ గా అవార్డు రావడంతో శోభా శెట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు.

Read More: బబుల్‌గమ్ హీరోయిన్ వీడియో.. మనసు చాలా పెద్దదంటూ ఫన్నీ ట్రోల్స్

ట్రెండింగ్ వార్తలు