Bigg Boss Telugu 7 యవర్ పిచ్చోడు? అని కామెంట్స్ చేస్తున్న శోభ శెట్టి.

October 28, 2023

Bigg Boss Telugu 7 యవర్ పిచ్చోడు? అని కామెంట్స్ చేస్తున్న శోభ శెట్టి.

బిగ్ బాస్  సీజన్ 7(Bigg Boss Telugu 7) కెప్టెన్సీ నామినేషన్ లో ఎవరు తక్కువ సార్లు నామినేట్ అవుతారో వారై ఈ 8 వీక్ కెప్టెన్ అవుతారు అని బిగ్ బాస్ తెలిపారు. దాంతో ఈ వారం బిగ్‌బాస్ లో కెప్టెన్సీ టాస్క్   గందరగోళంగా మారింది. ఎలాగైనా కెప్టెన్ కావాలనుకొన్న శోభాశెట్టి ఆశలపై హౌస్ మేట్లు నీళ్లు చల్లారు. కెప్టెన్సీ కంటెండెర్లుగా నిలిచిన వారికి ఇంటి సభ్యులు ఓటు వేసి కెప్టెన్‌గా ఎన్నుకోవాలి. ఈ సందర్బంగా యావర్, శోభా శెట్టిని నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన సంధర్బంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది.

శోభాశెట్టిని నామినేట్ చేస్తూ ప్రిన్స్ యావర్ తన కారణాలు చెప్పుకొచ్చాడు. యావర్ మాట్లాడుతూ నేను కెప్టెన్‌గా వున్నప్పుడు నేను నీకు డిప్యూటీ కెప్టెన్‌గా నియమిస్తే నువ్వు చేయనని చెప్పావు. నీకు కెప్టెన్సీ పదవి కంటే ఇమ్యూనిటీ కోసమే గేమ్ ఆడుతున్నావు. కాబట్టి నీకు కెప్టెన్ పదవికి అర్హురాలివి కాదు అని యావర్ తేల్చి చెప్పాడు. అయితే యావర్ కారణాలపై శోభాశెట్టి అభ్యంతరం చెప్పింది.

బిగ్‌బాస్ ఇంటిలో ఉండటానికి కెప్టెన్సీ పదవి నాకు అవసరం. దాంతో ఇమ్యునిటీ వస్తుంది అని శోభ తన వాదన వినిపించింది. అయితే మరి ఎందుకు డిప్యూటీ కెప్టెన్ పదవిని రిజెక్ట్ చేశావు అని ప్రిన్స్ యావర్ అడిగితే.. అది నా ఇష్టం అని శోభా సమాధానం ఇచ్చింది. అయితే నీకు కెప్టెన్ షిప్ అర్హత లేదంటూ యావర్ మాటలు వెల్లడించాడు.

కెప్టెన్సీ టాస్క్‌లో ప్రిన్స్ యావర్, శోభాశెట్టి ఇద్దరి మధ్య సహనం కోల్పోయి ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. దీనితో యావర్ పిచ్చోడు అంటూ శోభాశెట్టి కామెంట్ చేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన యావర్ తన చేతిలోని మిర్చి దండను నేలకేసి కొట్టాడు. ఇంటి సభ్యులు నచ్చ జెప్పిన తర్వాత అప్పుడు శోభా మెడలో యావర్ మిర్చి దండవేసి కెఫ్టెన్‌గా అనర్హురాలివి అంటూ కామెంట్ చేశాడు.

తనను నామినేట్ చేయడంతోపాటు కెప్టెన్సీకి దూరం చేసిన కంటెస్టెంట్లపై శోభాశెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే భోరున ఏడ్చింది. ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ తనని  ఓదార్చారు. ఇలా కెప్టెన్సీ టాస్క్ హాట్ హాట్ వాగ్వాదంతో ముగిసింది. చివరకు కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్ కృష్ణ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

Read More“తంగలాన్”, రిలీజ్, టీజర్ డేట్ ఫిక్స్

ట్రెండింగ్ వార్తలు