బిగ్ బాస్ 7 తెలుగు: డేంజ‌ర్‌జోన్‌లో టాప్ కంటెస్టంట్‌..ఇక `ఆట` ముగిసిన‌ట్టేనా?

October 26, 2023

బిగ్ బాస్ 7 తెలుగు: డేంజ‌ర్‌జోన్‌లో టాప్ కంటెస్టంట్‌..ఇక `ఆట` ముగిసిన‌ట్టేనా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడో సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ సీజ‌న్‌లో నాగార్జున హోస్టింగ్ క‌న్నా త‌న డ్రెస్సుల గురించే ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతుంది సోష‌ల్ మీడియాలో…అది అలా ఉంచితే ఈ సారి మొదటి రౌండ్’లో 14 మందిని కంటెస్టంట్లుగా పిలిచారు. అందులో ఇద్ద‌రో ముగ్గురినో హౌస్‌మేట్స్ అని కూడా ప్ర‌క‌టించిన‌ట్లున్నారు. త‌ర్వాత ఏమైందో దాన్ని అలా వ‌దిలేసి రెండో ద‌ఫాగా మ‌రికొంత మందిని పిలిచారు. వారిలో అర్జున్ త‌ప్ప మిగతా వారు అంత ఫెమిలియ‌ర్ కాదు..అర్జున్ కూడా ప్ర‌స్తుతానికి బ్యాలెన్స్‌డ్‌గానే ఆడుతున్నాడు మ‌రి చూడాలి..

ఇక బిగ్‌బాస్‌లో అంద‌రికీ ఇష్ట‌మ‌య్యే ఎలిమినేష‌న్ ఎపిసోడ్‌లో ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాల్గోవ వారంలో రతిక, ఐదు శుభశ్రీ , ఆరో వారం నయని పావని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజా మూర్తి వెళ్లిపోయింది. వరుసగా ఏడో ఆడ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఇది. ఆడ‌వారంద‌రినీ ఇంటికి పంపిస్తున్నాం అనుకున్నారో ఏమో బయటికి వెళ్లిపోయిన వారిలో ఒకరికి రీఎంట్రీ ఇస్తాం, వోట్లేయండి అని హౌజ్‌మేట్స్‌ను అడిగి, తక్కువ వోట్లు వచ్చిన రతికను తిరిగి హౌస్‌లోకి ప్రవేశపెట్టారు. ఇలా బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవ్వ‌రూ రెండు మూడు వారాల క‌న్నా ఎక్కువ రోజులు ఉన్న ప్ర‌స‌క్తే లేదు.. అది వేరే విష‌యం.

ఇక ఎనిమిదో వారం నామినేషన్స్ తాజాగా జరిగాయి. ఈ నామినేషన్స్‌లో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ఇంత‌వ‌ర‌కూ నామినేష‌న్స్‌కి రాని సందీప్ మాస్ట‌ర్ ఫ‌స్ట్ టైమ్ నామినేష‌న్‌కి వ‌చ్చిన‌ట్టున్నాడు. ఎందుకో అత‌ని మీద చాలా నెగ‌టివ్ గా ఉన్నారు నెటిజ‌న్లు. ఒక అన్అఫీషియ‌ల్ పోల్స్‌లో ఈ వారం ఓటింగ్‌లో టాప్‌లో శివాజీ ఉండగా.. ఆ తర్వాత వరుసగా భోలే షవాలి, అమర్ దీప్ చౌదరి, అశ్వినీ శ్రీ, గౌతమ్, ప్రియాంక, శోభా శెట్టి, ఆట సందీప్ ఉన్నారు. వీరిలో అత్యంత తక్కువగా 2.34 పర్సెంట్ సందీప్‌కు వస్తుండగా.. అత్యంత ఎక్కువగా ఓటింగ్ శివాజీకి 49 పర్సెంట్ వస్తోంది. దీంతో ఈ వారం డేంజర్ జోన్‌లో సందీప్, శోభా శెట్టి ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఆరు సీజన్లలో ప్రేక్షకులు 10 ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు. ఈ పది ఓట్లు ఒక కంటెస్టెంట్‍కు మాత్రమే వేయకుండా నచ్చిన వారందరికీ వేసే అవకాశం ఉండేది. వీటికితోడు 10 మిస్డ్ కాల్స్‌తో కూడా నచ్చిన విధంగా ఓటే వేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆ విధానాన్ని బిగ్ బాస్ మేకర్స్ పూర్తిగా మార్చేశారు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు ఒక ప్రేక్షకుడు ఒక్క ఓటు మాత్రమే వేయగలడు. ఇంట్లో తనకు నచ్చిన ఒకే ఒక్క సభ్యుడికి మాత్రమే ఓటు వేయాలి. హాట్ స్టార్ యాప్ నుంచే మాత్రమే ఈ ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక మిస్ట్ కాల్ కూడా ఒకటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

Read More: ఘ‌నంగా వెంక‌టేష్ రెండో కుమార్తె నిశ్చితార్థ వేడుక..హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు

ట్రెండింగ్ వార్తలు