పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన నటి శ్రద్ధాదాస్.. ఏమైందంటే?

January 11, 2024

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన నటి శ్రద్ధాదాస్.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రిటీలందరూ కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలో పెళ్లి చేసుకోగా ఈ ఏడాదిలో కూడా ఎంతోమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ ఏడాది పెళ్లి చేసుకునే వారిలో నటి శ్రద్ధాదాస్ ఒకరు.

ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ పలు సినిమాలలో నటించారు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ఈమె అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. ఇలా పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి శ్రద్ధాదాస్ అనంతరం బుల్లితెరపై కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ఇటు బుల్లితెర పైన అటు వెండితెర పైన బిజీ అయ్యారు.

కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం 32 సంవత్సరాల వయసులో ఉన్నారు. దీంతో ఈమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. గతకొద్ది రోజులుగా ఈమె ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారని ఏడాది శ్రద్ధాదాస్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈమె డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ విధంగా తన గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తరుణంలో శ్రద్ధదాస్ ఈ వార్తలపై స్పందించారు. తన పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయని నేను డేటింగ్ లో ఉన్నానంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వ్యాపారవేత్త ఎవరో కూడా నాకు తెలియదని ఈ వార్తలన్నీ కూడా ఆ వాస్తవాలే అంటూ ఇవే చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారడంతో ఈమె పెళ్లి వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని, ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు.

Read More: బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేసిన హనుమాన్.. ఇది మామూలు విషయం కాదు

ట్రెండింగ్ వార్తలు