సెకండ్ హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్స్ వీళ్లే?

February 5, 2024

సెకండ్ హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్స్ వీళ్లే?

ఇటీవల కాలంలో ఒక సినిమాలో ఇద్దరు హీరోలు నటించడం ఇద్దరు హీరోలు నటించడం సర్వసాధారణ అవుతుంది అయితే ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించిన ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లు ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నప్పటికీ వారు మాత్రం సెకండ్ హీరోయిన్ గానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి ఆ సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే..

ఈషా రెబ్బ: ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలలో మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ పాత్రలోనే ఎక్కువగా కనిపించి సందడి చేశారు.

ప్రణీత: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో దాదాపు పది సినిమాలలో నటించారు. ఈ పది సినిమాలలో ఈమె సగాని కంటే ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలోనే నటించారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈమె పూర్తిగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

క్యాథరిన్: కేథరిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలన్నింటిలోనూ కూడా ఈమె సెకండ్ హీరోయిన్ గానే అవకాశాలు అందుకున్నారు. ఇలా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చిన అది కూడా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే కావడంతో ఈమె కెరియర్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిందని చెప్పాలి.

శ్రద్ధదాస్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించినటువంటి శ్రద్ధాదాస్ ఈమె కూడా సెకండ్ హీరోయిన్గా మాత్రమే పరిమితమయ్యారు. అల్లు అర్జున్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలలో ఈమె నటించారు అయితే ఈ సినిమాలన్నింటిలో కూడా దర్శకులు ఈమెను సెకండ్ హీరోయిన్ గానే పరిమితం చేయడంతో ఈమె కెరియర్ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది అని చెప్పాలి.

Read More: ఆ స్టార్ హీరో వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న నటి త్రిష!

ట్రెండింగ్ వార్తలు