విత్ ఔట్ మేకప్.. శ్రుతి హాసన్ ఎంత బాగుందో?

January 1, 2024

విత్ ఔట్ మేకప్.. శ్రుతి హాసన్ ఎంత బాగుందో?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్(Shruti Haasan)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో శృతిహాసన్ పేరు కూడా ఒకటి. కాగా శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలి సిందే. ఆ సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. కాగా 2023 హీరోయిన్స్ లో ఎవరికి బాగా కలిసి వచ్చింది అంటే ముందుగా వినిపించే పేరు శృతిహాసన్.

గత ఏడాది బాల‌కృష్ఱ‌, చిరంజీవి సినిమాల‌తో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు మ‌ళ్లీ నాని హీరోగా వ‌చ్చిన‌ హ‌య్ నాన్న, ప్ర‌భాస్ స‌లార్ సినిమాల‌లోనూ న‌టించి ఈ ఏడాదికి గ్రాండ్‌ గా ముగింపు ప‌లికింది. ఈ సంవ‌త్స‌రం వ‌చ్చిన సినిమాల‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచి శృతి కేరీర్‌లోనే హ్యాట్రిక్ విజ‌యాలు సాధించి బెస్ట్ ఇయ‌ర్‌గా రికార్డులకెక్కింది. ళ్లీ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ క్రాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ అవ్వ‌డంతో మ‌రోసారి శృతి కెరీర్ గాడిలో ప‌డింది.

ఈ క్ర‌మంలోనే సినిమాల‌పై దృష్టి పెట్టిన అమ్మ‌డు సైలెంట్‌గా వ‌రుస‌ సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ దూసు కుపోతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈమె సినిమా పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడి యాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకూ తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విష యాల ను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. కాగా గత కొంతకాలంగా ఈమె శాంతను హజారికా అనే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం విడుదల కలసి ముంబైలో ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా శృతిహాసన్(Shruti Haasan) ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది. వితౌట్ మేకప్ తో అప్పుడే పడుకొని నిద్రలేచి తీసుకున్న ఫోటోని షేర్ చేసింది శృతిహాసన్. ఆ ఫోటోని చూస్తే వితౌట్ మేకప్ లో కూడా శృతిహాసన్ అందం ఏ మాత్రం తగ్గలేదని అనిపిస్తోంది. ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ శృతిహాసన్ వితౌట్ మేకప్ లో కూడా ఎంత అందంగా ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Moreదేవర సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. న్యూ ఇయర్ గిఫ్ట్ మామూలుగా లేదుగా?

ట్రెండింగ్ వార్తలు