Arrangements of Love: స‌మంత ప్లేసులో శృతి హాస‌న్‌..లెస్బియ‌న్ పాత్ర‌తో సాహ‌సం

January 24, 2024

Arrangements of Love: స‌మంత ప్లేసులో శృతి హాస‌న్‌..లెస్బియ‌న్ పాత్ర‌తో సాహ‌సం

ఖుషి త‌ర్వాత స‌మంత సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి ఆరోగ్యంపై శ్ర‌ద్ద పెట్టింది. అయితే సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు, వీడియోల‌తో ఫ్యాన్స్‌ను అల‌రిస్తూనే ఉంది. ఖుషి త‌ర్వాత స‌మంత న‌టించాల్సిన సినిమా `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ (Arrangements of Love). ఫిలిప్ జాన్ దర్శకత్వంలో భారతీయ రచయిత ఎన్‌ మురారి రాసిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా రూపొందనున్న చిత్రంలో సమంత లీడ్ రోల్ చేస్తున్నట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే..

ఈ సినిమాతో స‌మంత హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుంది అనుకున్నారు అంద‌రూ కాని ఆరోగ్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి సమంత తప్పుకున్నారు. ఇక ఈ సినిమాలో సమంత ప్లేస్‌లో శ్రుతిహాసన్ న‌టించ‌నుంది. ఇందులో లెస్బియ‌న్‌గా శృతి కనిపించబోతోంది. .అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర ఇది. అంతే గాక ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారు. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో కూడా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని రన్‌ చేసే పాత్రలో శ్రుతి హాసన్‌ నటిస్తోంది. ఆమెకు స‌పోర్టింగ్ రోల్‌లో వివేక్‌ కల్రా నటించ‌నున్నాడు. ఈ సినిమాకు చెన్నైస్టోరీస్‌ అనే టైటిల్‌ను కూడా అను కుంటున్నారు. తన తండ్రి ఆచూకి తెలుసుకోవాలని ఓ వ్యక్తి ఓ డిటెక్టివ్‌ ఏజెన్సీని కన్సల్ట్‌ అయితే ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుంది. ఆల్రెడీ శ్రుతీహాసన్‌ ‘ది ఐ’ అనే ఓ ఇంటర్‌నేషనల్‌ మూవీని ఇటీవల కంప్లీట్ చేసింది. మ‌రి చూడాలి ఈ సినిమా శృతి కెరీర్‌కు ఎంత‌వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డుతుందో…

Read More: గ్లామ‌ర్ డోస్ పెంచేసిన‌ అనుప‌మ‌..హాట్ ఫోటోస్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తోందిగా..

ట్రెండింగ్ వార్తలు