రొమాన్స్ తో రెచ్చిపోతున్న ప్రముఖ డైరెక్టర్.. ఆ హీరోయిన్ తో వీడియో సాంగ్ విడుదల!!

March 26, 2024

రొమాన్స్ తో రెచ్చిపోతున్న ప్రముఖ డైరెక్టర్.. ఆ హీరోయిన్ తో వీడియో సాంగ్ విడుదల!!

తమిళ ప్రముఖ దర్శకుడు అయిన లోకేష్ కనకరాజ్ అందరికీ సుపరిచితుడే. లోకేష్ కేవలం తమిళం లోనే కాదు తెలుగులో కూడా మంచి పేరుని సంపాదించుకున్నారు. అయితే ఇప్పటి దాకా లోకేష్ ని మనం దర్శకుడు గానే చూసాము కానీ మొట్టమొదటిసారి ఒక సాంగ్ లో నటించారు లోకేష్. అది కూడా స్వయంగా శృతిహాసన్ సరసన నటించడం విశేషం.

ఈ సాంగ్ ప్రోమో విడుదల చేసినప్పుడే ఫుల్ రొమాన్స్ తో నిండిపోయింది. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ విడుదలవ్వడంతో వాళ్ళ ఆశ్చర్యం రెట్టింపు అయింది. ప్రేమ, పెళ్లి తో పాటు రొమాన్స్ తో కూడుకున్న ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. దీనికి కమల్ హాసన్ లిరిక్స్ ఇవ్వగా తనే సొంతంగా నిర్మించారు కూడా.

లోకేష్ కనకరాజ్, శృతిహాసన్ ల పెయిర్ చాలా కొత్తగా అనిపించింది. ఈ పాటకు శృతిహాసన్ తన గొంతును ఇచ్చింది. ప్రైవేట్ ఆల్బంగా విడుదలైన ఈ పాట ఇప్పటికే మిలియన్ల వ్యూలను సంపాదించుకుంది.ఇక లోకేష్ కనకరాజ్ విషయానికొస్తే ఆయన తర్వాత చిత్రం రజినీకాంత్ తో ఉండబోతుంది. దాని గురించి అప్డేట్ ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు శృతిహాసన్ అడవి శేష్ తో కలిపి ఒక సినిమా తీస్తున్నట్టు చిత్ర బృందం కొంతకాలం కిందట అఫీషియల్ గా తెలిపింది.

కానీ ఆ సినిమా గురించి మారే అప్డేట్లు తర్వాత రాలేదు. కానీ శృతిహాసన్ సింగింగ్ పరంగా తన కెరీర్లో బాగా ఎదుగుతుంది. ఎప్పటికప్పుడు వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తూ తన మ్యూజిక్ ఆల్బమ్స్ తో ప్రేక్షకులను మనసులను గెలుచుకుంటుంది. అక్కడక్కడ కానర్ట్స్ చేస్తూ సోషల్ మీడియాలో లో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది శృతిహాసన్. ఒకవైపు సినిమాలు మరోవైపు సంగీతం రెండిటిని భలే బ్యాలెన్స్ చేసుకుంటుంది శృతిహాసన్.

Read More: పర్వతాలు ఎక్కుతూ తెగ చిల్ అవుతున్న మెగా కొత్తజంట!

ట్రెండింగ్ వార్తలు