డబ్బు ల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన చిరంజీవి.. ఎంతో తెలుసా?

April 22, 2024

డబ్బు ల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన చిరంజీవి.. ఎంతో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గొప్ప గొప్ప దానాలు చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. అందరికి తెలిసి కొన్ని దానాలు చేస్తే చాలామందికి సినీ పరిశ్రమ వ్యక్తులకు, అభిమానులకు ఎంతోమందికి సహాయం చేసారు. అప్పుడప్పుడు పలువురు చిరంజీవి చేసిన సహాయాలు గురించి చెప్తూ ఉంటారు.

అందులో భాగంగానే తాజాగా నటుడు శివాజీ కూడా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చిరంజీవి తనకు చేసిన ఒక సాయం గురించి తెలిపారు. కాగా నటుడు శివాజీ ఒకప్పుడు నటుడిగా, హీరోగా ఎన్నో సక్సెస్ లు చూసి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి, రాజకీయాల్లోకి వెళ్లి వచ్చి, ఇటీవల బిగ్ బాస్ లోకి వచ్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ తర్వాత సిరీస్ లు, సినిమాలు ఓకే చెప్తూ వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక శివాజీ మొదటి నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్ అని అనేక సందర్భాల్లో తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు సినిమాల్లో నటించాడు కూడా శివాజీ.

ఇకపోతే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తనకు చేసిన సాయం గురించి శివాజీ మాట్లాడుతూ.. మాస్టర్ సినిమా చేసేటప్పుడు ఆయనకు నేను ఒక అభిమానిగా, ఒక ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసు. ఫుల్ జోష్ లో షూటింగ్ జరుగుతోంది. అప్పుడు నా దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి డబ్బుల్లేవు. కొంచెం ఇబ్బంది పడుతున్నాను. నేను లేనప్పుడు ఈ విషయం ఎవరో చిరంజీవి గారితో సరదాగా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. షూటింగ్ అయ్యాక చిరంజీవి గారు నా దగ్గరికి వచ్చి పదివేల రూపాయలు ఇచ్చారు. నేను ఎందుకు, వద్దు అంటున్నా కూడా ఇచ్చారు. ఆ డబ్బులతో సంవత్సరం వరకు నాకు రెంట్ కి ఇబ్బంది కలగకుండా చేసారు. అప్పటికి నేను ఆయనకు అంతగా తెలీదు. ఆ సినిమాలోనే పరిచయం. అయినా నా కోసం ఆయన అంత చేశారు అని తెలిపారు. అందుకే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొనే అప్పట్నుంచి నాకు తోచినంతలో ఎవరికైనా అవసరం ఉంటే నేను కూడా సహాయం చేయడం మొదలుపెట్టాను అని తెలిపారు శివాజీ..

Read More: రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మాజీ ప్రపంచ సుందరి.. తన యాక్టింగ్ సూపర్ అంటూ!

ట్రెండింగ్ వార్తలు