రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మాజీ ప్రపంచ సుందరి.. తన యాక్టింగ్ సూపర్ అంటూ!

April 22, 2024

రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మాజీ ప్రపంచ సుందరి.. తన యాక్టింగ్ సూపర్ అంటూ!

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ మాజీ ప్రపంచ సుందరి నటి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇకపోతే మానుషి చిల్లర్‌ తాజాగా నటించిన సినిమా బడే మియా ఛోటే మియా. ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మాజీ నటి మానుషి చిల్లర్‌.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ తన నటనను సవాలు చేసే పాత్రల కోసం వేచి చూస్తున్నానని అన్నారు. సందీప్ రెడ్డి వంగా చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో కలిసి పని చేస్తానని అన్నారు. ఆమె మాట్లాడుతూ.. డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా సినిమాలంటే నాకెంతో ఇష్టం. ఆయన ప్రాజెక్టుల్లో నటించాలని ఉంది. ఇటీవల యానిమల్‌ చూశాను. రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర నాకు ఎంతో బాగా నచ్చింది.

కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను ధైర్యంగా నిలబడింది. రష్మిక నటన అద్భుతం. నటిగా నన్ను సవాలు చేసే అలాంటి పాత్రలు చేయాలని ఉంది అని తెలిపింది. అర్జున్‌రెడ్డి మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్‌సింగ్‌ మూవీలో ప్రీతి పాత్ర కోసం చిత్రబృందం తొలుత తననే సంప్రదించిందని అయితే, షాహిద్‌ మూవీలో హీరోయిన్‌ ఛాన్స్‌ వచ్చిందనే విషయం తెలియక తాను రిజక్ట్‌ చేశాను. అదీ కాక, ఆ సమయంలోనే తాను మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుపొందాను. దాంతో ఏడాది పాటు ఆ బృందంతో కాంట్రాక్ట్‌ కుదిరింది అని తెలిపారు . ఆ కారణంతోనే సినిమా చేయలేకపోయాను అని చెప్పు కొచ్చారు.

Read More: భజే వాయు వేగం మూవీ మేకర్స్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్.. నా తమ్ముడు లాంటివాడు అంటూ!

ట్రెండింగ్ వార్తలు