May 6, 2024
త్రిష సౌత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి వర్షం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈమె నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో ఈమె పేరు మారుమోగిపోవడమే కాకుండా భారీ స్థాయిలో అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో త్రిష పేరు మారుమోగిపోయింది.
ఇక త్రిష ప్రస్తుతం మూడు పదుల వయసు పూర్తి చేసుకొని నిన్ననే 41వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఇలా నాలుగుపదుల వయసులో ఉన్నప్పటికీ కూడా ఈమె రెట్టింపు అందంతో ఇప్పటికే వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతున్న అవకాశాలు కోల్పోకుండా బిజీ హీరోయిన్గా మారిపోయారు.
ఇక త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిష ప్రభాస్ తో కలిసిన నటించిన వర్షం సినిమా ఎలాంటి సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. ఈ సినిమా త్రిషకు మొదటి తెలుగు సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో ఈమె ఎంతో కంగారు పడ్డారట. ఇక ఈ సినిమా వర్షం కావడంతో ఎక్కువగా త్రిష వర్షంలో తడిసే సన్నివేశాలు ఉన్నాయి.
ఈ సీన్స్ అన్నీ కూడా దాదాపు 20 రోజులపాటు షూటింగ్ చేశారట 20 రోజులపాటు ఆమె ఆ వర్షంలో తడుస్తూ షూట్ చేయడంతో పూర్తిగా దగ్గు జలుబు రావడం వల్ల అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలయిందట. ఇలా హాస్పిటల్లో చేరినప్పటికీ ఈమె తన మొదటి సినిమా కోసం ఇలా కష్టపడ్డాను రిజల్ట్ ఎలా ఉంటుందోనని తెగ కంగారు పడిందట కానీ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె చాలా సంతోష పడ్డారట.
ఇక ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఈసినిమాని తమిళంలో కూడా రీమేక్ చేయాలని డైరెక్టర్స్ భావించారు. ఇక అందులో కూడా త్రిషనే హీరోయిన్గా ఎంపిక చేయాలని నిర్ణయించారు. కానీ ఈ సినిమా కోసం వర్షంలో తడిసి ఆమె ఎంతగా ఇబ్బంది పడిందనే విషయాలు గుర్తుచేసుకొని ఈ సినిమాలో తాను నటించనని తమిళంలో వర్షం సినిమా అవకాశాన్ని కోల్పోయారని తెలుస్తుంది.
Read More: స్విమ్ సూట్ లో కనిపించి షాక్ ఇచ్చిన నమ్రత… వైరల్ అవుతున్న ఫోటోలు!