మహేష్ అంటే నమ్రత భర్తగా మాత్రమే తెలుసు.. రానా కామెంట్స్ వైరల్!

May 6, 2024

మహేష్ అంటే నమ్రత భర్తగా మాత్రమే తెలుసు.. రానా కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకున్న మరోవైపు విలన్ పాత్రలలో కూడా నటిస్తూ హీరోగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇలా స్టార్ హీరోగా ఈయన సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా రానా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు ప్రభాస్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బాహుబలి సినిమా చేయక ముందు వరకు కూడా బాలీవుడ్ వారికి మన టాలీవుడ్ హీరోలు అంటే అలాగే టాలీవుడ్ సినిమాలు అన్న కూడా పెద్దగా తెలియదు. ఇక ఈయన బాహుబలి సినిమా కంటే ముందుగా ఏదో పని నిమిత్తం ముంబై వెళ్లారట అక్కడ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు జరిగిన సంఘటన గురించి రానా తెలిపారు. బాహుబలి సినిమా కంటే ముందుగా రానా పలు బాలీవుడ్ సినిమాలలో నటించడంతో అక్కడ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.

ప్రస్తుతం బాహుబలి సినిమా చేస్తున్నామని హీరోగా ప్రభాస్ నటిస్తున్నారని చెప్పగానే ప్రభాస్ అంటే ఎవరు అని అక్కడ వాళ్ళు ప్రశ్నించారని రానా తెలిపారు. ఇక వారికి ప్రభాస్ అంటే ఎవరు అనేది ఎలా చెప్పాలో తెలియక చత్రపతి, మిర్చి సినిమా చూశారా అంటే లేదని చెప్పారు. బాలీవుడ్ వారికి టాలీవుడ్ హీరోలు అంటే కేవలం చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వంటి వారు మాత్రమే తెలుసు కానీ ఈ జనరేషన్ వారు తెలియదని రానా తెలిపారు.

ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు అంటే కూడా అక్కడ ఎవరికీ తెలియదని రానా తెలిపారు. మహేష్ బాబు అంటే నమ్రత భర్త అని మాత్రమే తెలుసని రానా ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహేష్ బాబు నమ్రత భర్తగా మాత్రమే బాలీవుడ్ లో గుర్తింపు ఉందని ఈయన వెల్లడించారు.

Read More: వర్షం సినిమా కారణంగా ఆ మూవీ ఛాన్స్ కోల్పోయిన త్రిష!

ట్రెండింగ్ వార్తలు