పొట్టి నరేష్ ను చితకబాదిన బిగ్ బాస్ శివాజీ.. ఇదేం దారుణం అంటున్న నెటిజన్స్!

February 12, 2024

పొట్టి నరేష్ ను చితకబాదిన బిగ్ బాస్ శివాజీ.. ఇదేం దారుణం అంటున్న నెటిజన్స్!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు శివాజీ ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించారు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించినటువంటి శివాజీ ఇటీవల కాలంలో పూర్తిగా వెండితెర సినిమాలకు దూరమయ్యారు. ఇలా వెండితెర సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి శివాజీ అనంతరం కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు అయితే ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రాకముందే 90 అనే ఒక వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ బిగ్ బాస్ తర్వాత విడుదల కావడంతో ఎంతో మంచి ఆదరణ లభించింది 90 లలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా తమని తాము గుర్తు చేసుకుంటూ ఈ సిరీస్ చూశారు. ఇలా ఈ సిరీస్ ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇలా ఈ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి శివాజీ తాజాగా పొట్టి నరేష్ పట్ల దారుణంగా వ్యవహరించారు. ఓ కర్రతో ఆయనను విచక్షణ రహితంగా కొట్టారు. శివాజీ పొట్టి నరేష్ పై చెయ్యి చేసుకున్నారు. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే.. శివాజీ 90 వెబ్ సిరీస్ టీం తో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక స్కిట్ చేశారు ఇందులో శివాజీ చిన్న కొడుకు పాత్రలో పొట్టి నరేష్ నటించిన పేపర్స్ తీసుకొచ్చి తనకు చూపించి భయంతో నిలబడ్డారు.

ఇలా ఈ స్కిట్ లో భాగంగా జబర్దస్త్ కార్యక్రమంలోనూ చేస్తున్నావు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోను కమెడియన్ గా చేస్తున్నావు కానీ కామెడీ ఎక్కడ అంటూ సరదాగా తనని లాగిపెట్టి కర్రతో కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారడంతో నేటిజెన్స్ వీడియో పై ఫన్నీగా కామెంట్ చేస్తూ అయ్యో పాపం పొట్టి నరేష్ అడ్డంగా దొరికిపోయాడు అంటూ కామెంట్ చేయగా మరికొందరు దారుణం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read More: మరో బుల్లితెర షోలో కుమారి ఆంటీ.. ఇక ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయినట్టేనా?

ట్రెండింగ్ వార్తలు