నాకు సొంత ఇల్లు లేదు.. అద్దె కడుతూ బ్రతుకుతున్నా: సురేఖ వాణి

March 28, 2024

నాకు సొంత ఇల్లు లేదు.. అద్దె కడుతూ బ్రతుకుతున్నా: సురేఖ వాణి

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి కాస్త సినిమాలను తగ్గించారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం చాలా లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉంటారు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు..

ఇలా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తే ఫోటోలు కనుక చూస్తే సురేఖ వానికి సినిమా అవకాశాలు లేకపోయినా ఇంత లగ్జరీ లైఫ్ ఎలా గడుపుతుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి అయితే ఈ సందేహాలు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సురేఖ వాణి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

మీరు ఇప్పుడు నన్ను మా ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా మా ఇంట్లో ఏదైనా వస్తువులు లగ్జరీగా ఉన్నాయేమో చూడండి ఒక సోఫా, ఫ్రిడ్జ్ ఏసి తప్ప మా ఇంట్లో ఏ విధమైనటువంటి ఫ్లగ్జరీ వస్తువులు లేవని ఈమె తెలిపారు మేము లగ్జరీగా బ్రతుకుతున్నాము అనుకోవడం చాలా పొరపాటని చాలామంది జీవితాలు కన్నా మా జీవితం చాలా సాధారణంగా సాగిపోతుందని ఈమె తెలిపారు.

ప్రస్తుతం నేను ఉంటున్నటువంటి ఈ ఇల్లు కూడా నాకు సొంతం కాదు అద్దె కడుతూ ఈ ఇంట్లో ఉంటున్నాను అలాగే నేను తిరుగుతున్నటువంటి కారు కూడా సెకండ్ హ్యాండిల్ కారు. దీనికి కూడా నెల నెల ఈఎంఐ కడుతున్నానని సురేఖ వాణి తెలిపారు. ఇకపోతే ప్రతినెల నా మెయింటెనెన్స్ కోసం ఆనవాయితీగా వస్తున్నటువంటి కొన్ని ప్రాపర్టీలను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తన ఆర్థిక స్థితిగతులను వారు గడుపుతున్నటువంటి జీవితం గురించి సురేఖవాణి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: సమంత నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

ట్రెండింగ్ వార్తలు