పక్కా ప్లానింగ్ తో వెంకటేష్ 76వ సినిమా.. ఆ డైరెక్టర్ తోనే సినిమా చేయడానికి రెడీ!

February 27, 2024

పక్కా ప్లానింగ్ తో వెంకటేష్ 76వ సినిమా.. ఆ డైరెక్టర్ తోనే సినిమా చేయడానికి రెడీ!

తన కెరియర్ లోనే ప్రతిష్టాత్మకమైన 75 వ సినిమా తో ఈ సంవత్సరం పండగకి సైంధవ్ పేరుతో మన ముందుకి వచ్చారు వెంకటేష్. అయితే ఆ సినిమా ని మిశ్రమ స్పందనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వెంకటేష్ కి. అయితే తన 76వ సినిమాని పక్కగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. వెంకటేష్ తో సినిమా చేయటానికి తరుణ్ భాస్కర్ వంటి ఎంతోమంది దర్శకులు రెడీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు వెంకటేష్ కి ఒక హిట్ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఆచితూచి అడుగేస్తున్న వెంకటేష్ డైరెక్టర్ విషయంలో కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాడు. అందుకే తనకి ఎఫ్2, ఎఫ్3 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అనిల్ రావిపూడి తో తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు సమాచారం. ఈ సినిమాని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నారు.

అయితే ముందుగా ఈ ప్రాజెక్టు ని చిరంజీవికి వినిపించారంట అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్ దిల్ రాజు. అయితే ఎందుకో అనిల్ రావిపూడి చెప్పిన కథపై ఆయన పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దాంతో వెంటనే నో చెప్పేసారంట చిరంజీవి. ఇక ఆ కథని వెంకటేష్ కి వినిపించారంట డైరెక్టర్, ప్రొడ్యూసర్. కధ కి ఇంప్రెస్ అయిన వెంకటేష్ వెంటనే సినిమాకి ఓకే చెప్పేసారు.

వెంకటేష్ ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్2,ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. కానీ అవి అన్ని మల్టీ స్టారర్ మూవీస్ కానీ ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టు సోలో హీరో గా ఉంటుందని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మహాశివరాత్రి రోజు అంటే మార్చ్ 8న రాబోతున్నట్లు, ఆ సినిమాకి సంబంధించిన మిగతా అప్డేట్స్ కూడా అదే రోజు అనౌన్స్ చేయవచ్చు అంటున్నారు సినీ వర్గాలవారు.

Read More: కుమారి ఆంటీ నెల ఆదాయం ఎంతో తెలుసా.. ఎవరు సాటిరారుగా?

ట్రెండింగ్ వార్తలు