వంద‌కోట్ల సినిమాల‌తో బాల‌య్య రికార్డులు..

October 26, 2023

వంద‌కోట్ల సినిమాల‌తో బాల‌య్య రికార్డులు..

పండుగ సీజ‌న్‌లో బాల‌య్య సినిమా వ‌చ్చిందంటే చాలు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో పాటు అధిరిపోయే క‌లెక్ష‌న్లు ఆ సినిమా సొంతం అనే మాట మ‌రోసారి రుజువైంది. ఈ సారి దసరా బరిలో భ‌గ‌వంత్ కేస‌రిగా దిగిన బాల‌య్య దిమ్మతిరిగే రేంజ్‌లో..తన రోరింగ్ నేచర్‌తో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌నే కాదు.. తెలుగింటి అక్కాచెల్లెల్లు, అన్నాతమ్ముళ్లందర్నీ తన సినిమాతో ఫిదా చేస్తున్నారు. నేల‌కొండ భగవంత్ కేసరిగా వారందర్నీ కట్టిపడేస్తున్నారు. థియేటర్లో భావోద్వేగాల జెర్నీని వారికి పరిచయం చేస్తున్నారు. దాంతో పాటే..ఓ రేంజ్‌లో కలెక్షన్లను కుమ్మేస్తూ..బాక్సాఫీస్ దగ్గర నయా నయా రికార్డులు బద్దలు కొడుతున్నారు బాలయ్య.

మూడు 100 కోట్ల సినిమాలు 100 కోట్ల క్లబ్‌లోకి చేరి హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకుని సెకండిన్నింగ్స్‌లో త‌న‌కు సాటిలేదు అని స‌వాళు విసిరారు. ఆయ‌న ఏజ్ హీరోలంద‌రూ ఒక హిట్ రెండు ప్లాఫుల‌తో అతి క‌ష్టం మీద బండి లాక్కొస్తుంటే బాల‌య్య మాత్రం వారికి అంద‌నంత వేగంతో దూసుకుపోతున్నారు. అఖండ‌, వీర‌సింహారెడ్డి,భ‌గ‌వంత్ కేస‌రి ఇలా మూడు 100 కోట్ల సినిమాల‌తో రికార్డులు తిర‌గ‌రాస్తున్నారు బాల‌య్య‌.

హై స్పీడ్‌లో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి త‌ను కూడా ఏం త‌క్కువ కాదంటూ అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా చాటారు అనిల్ రావిపూడి. స‌రిలేరు నీకెవ్వ‌రు, ఎఫ్ 3, భ‌గ‌వంత్ కేస‌రి ఇలా మూడు 100 కోట్ల సినిమాల‌తో హై స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. బాల‌య్య‌ను భగవంత్‌ కేసరిగా మార్చిన‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి…. ఈ సినిమాలో ఆయన్నుస‌రికొత్తగా ఆవిష్కరించారు. తనుకు అనుకున్న కథకు ఎలాంటి డ్యామేజ్‌ తగలకుండా… బాలయ్య మాస్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకుండా.. పర్ఫెక్ట్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.

Read More: ‘ప్లాంట్‌ మ్యాన్‌’ చిత్రం నుంచి ‘కన్నమ్మ.. చిట్టి గుండెలోన దాచలేని గోలమ్మ..’ లిరికల్‌ వీడియో

ట్రెండింగ్ వార్తలు