భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ దద్దరిల్లిదంట

October 19, 2023

భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ దద్దరిల్లిదంట

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో భగవంత్ కేసరి సినిమా మొదలయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అలాగే బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటించారు.

యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ మూవీ చూసిన ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందని రివ్యూ ఇస్తున్నారు. బాలయ్య మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారని శ్రీలీల కూడా బాలయ్యకు పోటీగా నటించిందని అంటున్నారు. అలాగే కాజల్ కూడా తన పరిధి మేరకు చక్కగా నటించిందని అంటున్నారు.

Read More: ఈ దసరా.. థియేటర్‌లో దద్దరిల్లే సినిమాలు ఇవే.. మరి ఓటీటీ చిత్రాలు!

ట్రెండింగ్ వార్తలు