ఓటీటీలోకి ఈరోజు ఏకంగా అన్ని సినిమాలు.. కానీ ఆ మూడు సినిమాలే స్పెషల్!

February 8, 2024

ఓటీటీలోకి ఈరోజు ఏకంగా అన్ని సినిమాలు.. కానీ ఆ మూడు సినిమాలే స్పెషల్!

ప్రస్తుత రోజుల్లో థియేటర్లలోకి సినిమాలు ఏ రేంజ్ లో అయితే విడుదల అవుతున్నాయో ఓటీటీ లోకి కూడా అదే విధంగా విడుదల అవుతున్నాయి. అలాగే ఇప్పటికే థియేటర్లలోకి విడుదల అయినా సినిమాలు నెలరోజులు కూడా తిరగకముందే అప్పుడే ott లో దర్శనమిస్తున్నాయి. ఇకపోతే మరొక వీకెండ్ రాబోతోంది. ఇక రేపే శుక్రవారం కావడంతో ఏ ఏ సినిమాలో విడుదల అవుతాయి అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి.

సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్‌ స్ట్రీమింగ్ అవుతుండగా, మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ ‍అయలాన్ ఈ వీకెండ్ లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి.

మరి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది? ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది? అన్న విషయానికి వస్తే.. ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదల అయ్యింది. ఇకపోతే నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అయ్యే సినిమాల విషయానికి వస్తే.. వన్ డే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 08 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలోకి రానుంది. భక్షక్ హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్, అలాగే లవర్ స్టాకర్ కిల్లర్ అనే డాక్యుమెంటరీ సిరీస్లు ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే యాషెస్ అనే టర్కీ సిరీస్ ఫిబ్రవరి 09 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎ కిల్లర్ పారడాక్స్ అనే కొరియన్ సిరీస్ ఫిబ్రవరి 09 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆల్ఫా మేల్స్ సీజన్ 2 స్పానిష్ సిరీస్ ఫిబ్రవరి 09 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే హారిబుల్ బాసెస్ ఫిబ్రవరి 10న విడుదల కాబోతుండగా, బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. కెప్టెన్ మిల్లర్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ పిబ్రవరి 09 నుంచి విడుదల కాబోతోంది. డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌ లో విడుదల అయ్యే వాటి విషయానికి వస్తే.. ఆర్య: అంతిమ్ వార్-సీజన్-వెబ్ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి రానుంది. కాటేరా అనే కన్నడ డబ్బింగ్ మూవీ జీ5 ఫిబ్రవరి- 10 నుంచి స్ట్రీమింగ్ గా ఉంది. అలాగే హలో అని వెబ్ సిరీస్ కూడా ఫిబ్రవరి 8 నుంచి రానుంది. అయలాన్ తెలుగు డబ్బింగ్ మూవీ సన్ నెక్స్ట్ లో ఫిబ్రవరి 09 ముంచి స్ట్రీమింగ్ కానుంది.

Read More: త్వరలోనే బాలయ్య అఖండ 2.. అన్నీ సిద్ధం అంటూ!

ట్రెండింగ్ వార్తలు