ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!

February 5, 2024

ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!

ప్రతివారం ఎన్నో సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి. ఇలా థియేటర్లలో మాత్రమే కాకుండా చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో కూడా విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఫిబ్రవరి రెండో వారంలో కూడా ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారంలో థియేటర్లలో అలాగే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..

ఈగల్: సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రవితేజ అనుపమ కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

లాల్ సలాం: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9వ తేదీ రాబోతుంది. ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేశారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తిరిగి విడుదల చేయాలని భావిస్తున్నారు ఈ సినిమా కూడా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.

యాత్ర 2: మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్న యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీ విడుదల కాబోతోంది.

ట్రూ లవర్: మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ట్రూ లవర్. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది.

ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు:

నెట్‌ఫ్లిక్స్‌:

•మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

Guntur Kaaram (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShowవన్‌ డే (హాలీవుడ్‌) ఫిబ్రవరి 8

భక్షక్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 9

డిస్నీ+హాట్‌స్టార్‌: •ఆర్య (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 9 స్ట్రీమింగ్ కానుంది

బుక్‌ మై షో:

•ఆక్వామెన్‌ (హాలీవుడ్)ఫిబ్రవరి 5 న ప్రసారం కానుంది

When Is 'Aquaman and the Lost Kingdom' Coming To Streaming On Max?ఆహా:

•బబుల్‌గమ్‌ (తెలుగు) ఫిబ్రవరి 9 విడుదలకు సిద్ధమైంది సుమ కుమారుడు రోషన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.

అమెజాన్ ప్రైమ్:

తమిళ హీరో ధనుష్ నటించినటువంటి కెప్టెన్ మిల్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రసారం కానుంది.

Captain Miller (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShowRead More: రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్!

ట్రెండింగ్ వార్తలు