రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్!

February 5, 2024

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్!

మెగా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా అనే పాన్ ఇండియా సినిమాతో పాటు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేశారు. ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాకు నూతన దర్శకుడు ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్గా సందడి చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నవదీప్ మిర్ సర్వార్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా హిందీ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి మేకర్స్ తెలియజేస్తూ తాజాగా విడుదల చేసినటువంటి పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ సినిమా ద్వారా అయినా ఈయన సక్సెస్ అందుకుంటారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ కనుక చూస్తే సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెరుగుతున్నాయి.

Read More: తమన్నాతో పెళ్లిపై స్పందించిన విజయ్ వర్మ.. పెళ్లెప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు